Advertisement

  • బీహార్ ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది...నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్

బీహార్ ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది...నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్

By: chandrasekar Fri, 23 Oct 2020 1:19 PM

బీహార్ ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది...నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్


బీహార్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ ఛీఫ్ నితీష్ పై ఆరోపణలు చేయడమే కాకుండా ప్రదాని మోదీకు సూచనలు జారీ చేశారు. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కమార్ తో విబేధించిన ఎన్డీయే భాగస్వామి ఎల్జేపీ బయటకు వచ్చేసింది. సొంతంగా పోటీ చేస్తోంది. అటు బీజేపీ, జేడీయూలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్డీయే నుంచి బయటికొచ్చిన ఎల్జేపీ ఛీఫ్ చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా నితీష్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనికి కారణం ఈ ఆరోపణల్లో ప్రధాని మోదీకు కూడా సూచనలు జారీ చేయడమే.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల అనంతరం కూటమి నుంచి జంప్ కావచ్చని పాశ్వాన్ ఆరోపణలు చేసారు. అదే సమయంలో మోదీజీ జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా సూచించారు. గత ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్ ఆశీస్సులతో గౌరవనీయులైన నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అయ్యారని ఆ తరువాత ఆయనను మోసగించి ప్రధాని మోదీ సహకారంతో సీఎం పదవిని కాపాడుకున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు తీసుకుంటున్నారని తరువాత లాలూ శిబిరాని వెళితే ఏం చేస్తారని చిరాగ్ చేసిన ట్వీట్ పరోక్షంగా మోదీపై సూచనలను స్పష్టం చేస్తోంది. ఎన్డీయే నుంచి బయటికొచ్చినా చిరాగ్ పాశ్వాన్ మనసంతా బీజేపీనే ఉంది. ఎన్నికల అనంతరం బీహార్‌లో బీజేపీ - ఎల్జేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని పదే పదే చెబుతూనే ఉన్నారు.

Tags :

Advertisement