Advertisement

Breaking: ప్రమాణం చేసిన 3 రోజులకే మంత్రి రాజీనామా...!

By: Anji Thu, 19 Nov 2020 10:05 PM

Breaking: ప్రమాణం చేసిన 3 రోజులకే మంత్రి రాజీనామా...!

బిహార్‌లో ఓ మంత్రికి ఆ పదవి మూడు రోజుల ముచ్చటే అయింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి మేవాలాల్ చౌదరి గురువారం (నవంబర్ 19) సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు.

బిహార్‌లో మూడు రోజుల కిందట నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 12 మంది సభ్యుల్లో మేవాలాల్ ఒకరు. కనీసం జాతీయ గీతం కూడా పాడటం రాని మేవాలాల్‌కు విద్యాశాఖ కేటాయించడం ఏంటని ఆర్జేడీ ప్రశ్నించింది.

గతంలో జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా మేవాలాల్ ‘జనగణమన..’ పాడటంలో ఇబ్బంది పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను ట్వీటర్ వేదికగా షేర్ చేసింది. బిహార్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై సెటైర్లు వేసింది.

ఓ జాతీయపతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేవాలాల్‌.. జాతీయ గీతాన్ని పూర్తిగా పాడలేకపోయారు. మధ్యలో కొన్ని లైన్లు పాడకుండానే జయహే అంటూ ముగించారు.

ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఆర్జేడీ..‘బిహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌధరీ.. అనేక అవినీతి కేసుల్లో నిందితుడు.. కనీసం జాతీయ గీతం కూడా తెలియని వ్యక్తి. నీతీశ్ కుమార్‌ జీ.. ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా?’ అని ట్వీట్ చేసింది.

Tags :

Advertisement