Advertisement

  • హోంశాఖ‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్

హోంశాఖ‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్

By: chandrasekar Tue, 17 Nov 2020 8:03 PM

హోంశాఖ‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్


ముఖ్యంగా గుర్తించబడే హోంశాఖ‌ను బీహార్ సీఎం నితీశ్ కుమార్ త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. బీహార్ సీఎంగా సోమ‌వారం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న వ‌ద్దే హోంశాఖ కూడా ఉంచుకున్నారు. క్యాబినెట్‌కు చెందిన పోర్ట్‌ఫోలియోల‌ను సీఎం నితీశ్ ఇవాళ ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్‌లో 14 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ నేత‌లు తారిక్ కిశోర్ ప్ర‌సాద్‌, రేణూ దేవీలు డిప్యూటీ సీఎంలుగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌తంలో డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ వ‌ద్ద ఉన్న శాఖ‌ల‌న్నింటినీ కొత్త మంత్రి ప్ర‌సాద్‌కు అప్ప‌గించారు.

కానీ ఫైనాన్స్ శాఖ కూడా డిప్యూటీ సీఎం తారిక్ ఖాతాలోకి వెళ్లింది. ఇక మ‌హిళా అభివృద్ధి శాఖ‌ను మ‌రో డిప్యూటీ రేణూ దేవికి అప్ప‌గించారు. ప్రస్తుతం సీఎం నితీశ్ కుమార్ హోంశాఖ‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. దీనితో పాటు జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, విజిలెన్స్‌, ఎల‌క్ష‌న్‌, మ‌రే మంత్రికి కేటాయించ‌ని శాఖ‌ల‌ను ఆయ‌న త‌న వ‌ద్ద ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం తారిక్ ప్ర‌సాద‌వ్ వ‌ద్ద ఫైనాన్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్సెస్‌, ప‌ర్యావ‌ర‌ణం-అడ‌వులు, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్‌, అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ శాఖ‌లు ఉన్నాయి.

ఈ శాఖ‌ల‌న్నీ గ‌తంలో సుశీల్ కుమార్ మోదీ చూశారు. మ‌రో డిప్యూటీ సీఎం రేణూ దేవి పంచాయత్ రాజ్‌, బీసీ అప్‌లిఫ్ట్‌, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి బీసీ సంక్షేమం, ప‌రిశ్ర‌మ‌లు శాఖ‌ల‌ను చూడ‌నున్నారు. గ్రామీణ ఇంజినీరింగ్‌, గ్రామీణ అభివృద్ధి, జ‌ల వ‌న‌రులు, స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌ల‌ను జేడీయూ నేత విజ‌య్ కుమార్ చౌద‌రీ చూసుకుంటారు. ఎన‌ర్జీ, ప్రొహిబిష‌న్‌, ప్లానింగ్‌, ఫుడ్ అండ్ క‌న్జ్యూమ‌ర్ అఫైర్స్ శాఖ‌లు బిజేంద్ర ప్ర‌సాద్ యాద‌వ్ ఖాతాలోకి వెళ్లాయి. రెవ‌న్యూ, నాయ శాఖ‌ల‌ను రామ్ సూర‌త్ రాయ్ చూసుకోనున్నారు. మంత్రి వర్గం విస్తరణ చేసిన తరువాత మరిన్ని శాఖలు మారవచ్చు.

Tags :
|
|

Advertisement