Advertisement

  • బీహార్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల...నితీష్ కుమార్ కు భారీ షాక్

బీహార్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల...నితీష్ కుమార్ కు భారీ షాక్

By: Sankar Sun, 08 Nov 2020 07:54 AM

బీహార్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల...నితీష్ కుమార్ కు భారీ షాక్


బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిన్నటితో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ తాజాగా విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్‌ బంధన్‌ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

బిహార్‌లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది.

కాగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సర్కారుపై ఉన్న వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశమున్నట్లు సర్వేలో వెల్లడైంది. పట్నా,నలందాతోపాటు వాయువ్య భోజ్‌పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలో వెల్లడైంది.

Tags :
|
|

Advertisement