Advertisement

  • 139 మంది రేప్ కేసు: ప్రదీప్ కు మద్దతుగా బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా

139 మంది రేప్ కేసు: ప్రదీప్ కు మద్దతుగా బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా

By: Anji Mon, 31 Aug 2020 09:16 AM

139 మంది రేప్ కేసు: ప్రదీప్ కు మద్దతుగా బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా

దాదాపు 139 మంది తనను ఐదు వేల సార్లు అత్యాచారం చేశారని, కొన్నేళ్ల నుంచి ఇది కొనసాగుతోందంటూ ఓ దళిత యువతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆమె హైదరబాబ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

అయితే ఆమె ఇచ్చిన లిస్టులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు కూడా ఉండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్.. ఆ అమ్మాయి ఎవరో కూడా తనకు తెలియదని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుపాడు. ఇందులోకి లాగడం అనేది తనను మానసిక మానభంగం చేయడమే అంటూ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు ఇప్పటికే యాంకర్ ప్రదీప్‌‌కు అండగా నిలుస్తూ పలువురు యాంకర్స్ స్పందిస్తున్నారు.

ఇప్పటికే యాంకర్ రవి.. ప్రదీప్‌కు మద్దతు తెలిపాడు. దయచేసి ప్రదీప్‌పై సోషల్ ట్రోలింగ్ ఆపండి అని కోరాడు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా కూడా రియాక్ట్ అవుతూ తన మద్దతు తెలిపాడు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని తాను ప్రదీప్‌కు అండగా ఉంటానని పేర్కొంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు అలీ రెజా. వాస్తవాలు తెలియకుండా సోషల్ ట్రోలింగ్ చేయకండి అని కోరాడు. మరోవైపు నటుడు కృష్ణుడు కూడా ఆ అమ్మాయి చెబుతుందంతా అవాస్తవం అని కొట్టిపారేస్తూ ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని అన్నాడు.

Tags :

Advertisement