Advertisement

Breaking News; హైదరాబాద్ లో జనం భయంతో పరుగులు...!

By: Anji Sat, 17 Oct 2020 12:11 PM

Breaking news; హైదరాబాద్ లో జనం భయంతో పరుగులు...!

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. నగరంలోని రాజేంద్ర నగర్ సర్కిల్ సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహడీ, తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలు రావడంతో ప్రజలు కంగుతిన్నారు.

భయాందోళనలతో ఇంట్లో నుండి బయటికి పరుగులు తీశారు. గతంలో కూడా ఇదేవిధంగా భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకూ గచ్చిబౌలిలో కూడా మొన్న భూకంపం వచ్చిందన్న వార్తలు వైరల్ అయ్యాయి.

రాత్రి వర్షంలో జనం భయాందోళనలకు వ్యక్తం చేస్తూ బయటకు పరుగులు తీశారు. రాత్రంతా బయటే ఉన్నారు. భూమి కంపించిందని కూడా పలువురు తెలిపారు. అంతకుముందు బోరబండ ప్రాంత వాసుల్ని కూడా భరీ శబ్ధాలు భయపెట్టాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ప్రజల్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అర్ధరాత్రి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయకంపితులయ్యారు. భారీ శబ్దాలు వచ్చిన ప్రాంతాలను రాజేందర్ నగర్ ఎంఐఎం పార్టీ కంటెస్టెంట్స్ అభ్యర్థి మీర్జా రహిమత్ బేగ్ సందర్శించారు. ఇక్కడి ప్రజలకు ధైర్యంగా ఉండాలని తెలిపారు.

గతంలో కూడా ఇదేవిధంగా ఈ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే వర్షలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు భారీ శబ్ధాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Tags :

Advertisement