Advertisement

  • శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్ పై భారీ డిస్కౌంట్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్ పై భారీ డిస్కౌంట్

By: Sankar Thu, 17 Sept 2020 3:50 PM

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్ పై భారీ డిస్కౌంట్


స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సృష్టించుకున్న మొబైల్ బ్రాండ్ శాంసంగ్..గాలక్సీ ఫోన్లకు భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది..అయితే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ డేస్ సేల్ లో భాగంగా పలు మొబైళ్లపై తగ్గింపు ధరలను సంస్థ ప్రకటించింది.

ముఖ్యంగా గెలాక్సీ నోట్ 20పై 9 వేల రూపాయల పరిమితకాల తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులకు 6,000క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ తోపాటు, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్ ,రిటైల్ స్టోర్లలో ఈ తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు శాంసంగ్ ఇతర గెలాక్సీ ఫోన్లపై కూడా తగ్గింపు అఫర్లను అందుబాటులో ఉంచింది.

గెలాక్సీ నోట్ 20 లాంచింగ్ ధర 77,999 రూపాయలు. సేల్ ధర 68,999 రూపాయలు. ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో ఆరువేల తగ్గింపు. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను 62,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ బ్లూ రంగులలో ఇది లభిస్తుంది.

8 జిబి రామ్ , 256 జిబి స్టోరేజ్ తో వచ్చిన ఈ ఫోన్లో 4300 ఎంఏహెచ్ బాటరీ ఉంది..ఇక వెనక 12+64+12మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా, ముందు 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది..

Tags :
|

Advertisement