Advertisement

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ వీరే..

By: Sankar Sun, 06 Sept 2020 9:29 PM

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ వీరే..


తెలుగులో మూడు సీజన్లు ప్రేక్షకులను అద్భుతంగా అలరించి బుల్లితెర మీద రికార్డులు సృష్టించిన బిగ్ బాస్ నాలుగవ సీజన్ ప్రారంభం అయింది..ఈ సీజన్ కు కూడా గత సీజన్లో హోస్ట్ గా చేసిన నాగార్జున నే హోస్ట్ గా వ్యవిహరిస్తున్నారు..మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు..ఇందులో చాల రన్గలకు చెందిన ఫేమస్ పర్సన్స్ ఉన్నారు..ఇక ఈ సీజన్లో హోస్ట్ గానే గాక నాగార్జున తండ్రి పాత్రలో కూడా స‌రికొత్త‌గా క‌నిపించాడు.

1. మొద‌టి కంటెస్టంట్ గా టాలీవుడ్ న‌టి మోనాల్ గజ్జ‌ర్ మొద‌టి కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది

2. ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ రెండో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చారు. 2002లో స‌త్యం సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

3. మూడో కంటెస్టంట్ గా లక్ష్మీప్ర‌స‌న్న లాస్య ప్రియాంక రెడ్డి అలియాస్ లాస్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లాస్య ప‌లు టీవీ షోల‌కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

4. నాలుగో కంటెస్టంట్ గా అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో సినీ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించాడు

5. ఐదో కంటెస్టంట్ గా జోర్దార్ సుజాత బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టింది.

6. ఆరో కంటెస్టెంట్ గా సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ మెహ‌బూబ్ దిల్ సే ఎంట్రీ ఇచ్చాడు.ఇతను టిక్ టాక్ వీడియోస్ , సాంగ్స్ , పెరఫామాన్సులతో యూట్యూబ్ లో బాగా ఫేమస్

7. ఏడో కంటెస్టెంట్ గా దేవి నాగ‌వ‌ల్లి బిగ్ బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించింది. రాజ‌మండ్రిలో పుట్టిన దేవి నాగ‌వ‌ల్లి న్యూస్ రీడ‌ర్ గా, న్యూస్ ప్ర‌జెంట‌ర్ గా అంద‌రికీ సుపరిచితురాలు

8. దేత్త‌డి హారిక ఎనిమిదో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

9. తొమ్మిదో కంటెస్టంట్ గా టీవీ యాక్ట‌ర్ స‌య్య‌ద్ సోయ‌ల్ రియాన్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించాడు.

10. ప‌ద‌వ కంటెస్టంట్ గా అరియానా గ్లోరి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జెమినీ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే కెవ్వు కామెడీ షోలో యాంక‌ర్ గా అందరినీ అల‌రించింది అరియానా గ్లోరి.

11. ప‌దకొండో కంటెస్టంట్ గా ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ అమ్మ రాజశేఖ‌ర్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

12. టాలీవుడ్ న‌టి క‌రాటే క‌ళ్యాణి 12వ కంటెస్ంట్ గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది

13. నోయ‌ల్ బిగ్ బాస్ హౌజ్ లోకి 13వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు

14. పద్నాలుగో కంటెస్టెంట్ గా వెబ్ సిరీస్ నటి దివి ఎంట్రీ ఇచ్చారు

15. 15వ కంటెస్టెంట్‌గా నటుడు అఖిల్‌ ఎంటరయ్యాడు.
16. 16వ కంటెస్టెంట్‌గా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది.

Tags :
|
|
|

Advertisement