Advertisement

  • హెల్త్ వ‌ర్క‌ర్స్‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంశ‌లు కురిపించిన బిగ్ బీ

హెల్త్ వ‌ర్క‌ర్స్‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంశ‌లు కురిపించిన బిగ్ బీ

By: chandrasekar Thu, 16 July 2020 12:56 PM

హెల్త్ వ‌ర్క‌ర్స్‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంశ‌లు కురిపించిన బిగ్ బీ


ప్ర‌స్తుతం నానావ‌తి ఆసుప‌త్రిలో క‌రోనాతో బాధ‌ప‌డుతున్న అమితాబ్ వైద్యం పొందుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అమితాబ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, మ‌రో వారం రోజుల‌లో ఆయ‌న ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అవుతార‌ని వైద్యులు అంటున్నారు.

అయితే త‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ కంటికి రెప్ప‌లా చూసుకుంటున్న హెల్త్ వ‌ర్క‌ర్స్‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంశ‌లు కురిపించారు బిగ్ బీ. స‌హ‌జ‌మైన తెల్ల దుస్తులు వేసుకున్న వారు సేవ చేసేందుకు అంకితం. దేవుడి అవ‌తారంలో ఉన్న వారు అహాన్ని చెరిపేసి మ‌న సంర‌క్ష‌ణ స్వీక‌రించారు.

మాన‌వ‌త్వ‌పు జెండాను ఎగురువేస్తున్నారు అని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ ఆసుప‌త్రి నుండి కూడా త‌ర‌చూ ట్వీట్స్ చేస్తున్న విష‌యం విదిత‌మే. బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో అమితాబ్‌తో పాటు అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య‌కి కూడా కరోనా సోకిన విష‌యం విదిత‌మే

Tags :
|

Advertisement