Advertisement

  • బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల ..ఆడేందుకు ఆసక్తి చూయిస్తున్న భారత స్టార్ ఆటగాళ్లు

బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల ..ఆడేందుకు ఆసక్తి చూయిస్తున్న భారత స్టార్ ఆటగాళ్లు

By: Sankar Sun, 25 Oct 2020 4:53 PM

బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల ..ఆడేందుకు ఆసక్తి చూయిస్తున్న భారత స్టార్ ఆటగాళ్లు


ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ మెగా టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. డిసెంబర్ 3వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఒక్కో టీమ్‌లో ముగ్గురు విదేశీ క్రికెటర్లకు ఆడటానికి ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు నిబంధనల్లో స్వల్పంగా మార్పులు చేసింది. ఐపీఎల్‌లో ఒక్కో జట్టులో గరిష్ఠంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఆడటానికి ఛాన్స్ ఉంది. ఇదే తరహాలో ముగ్గురికి అవకాశం ఇవ్వడం వల్ల విదేశీ క్రికెటర్ల సంఖ్య ఈ సారి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ సారి భారత్ నుంచి కొంతమంది సీనియర్లు, మాజీ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే భారత ఆటగాళ్లు ఇతర దేశాల లీగ్ లలో ఆడాలి అంటే అన్ని ఫార్మటు లలో భారత జట్టు నుంచి తప్పుకొని ఉండాలి..దీనితో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన యువరాజ్ సింగ్, సురేష్ రైనా కూడా బీబీఎల్‌ పై కన్నేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్ వంటి మరికొందరు క్రికెటర్లు బీబీఎల్‌లో ఆడటానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

Tags :

Advertisement