Advertisement

  • జార్జియాను రీకౌంటింగ్ ద్వారా త‌న ఖాతాలో వేసుకున్న బైడెన్‌...

జార్జియాను రీకౌంటింగ్ ద్వారా త‌న ఖాతాలో వేసుకున్న బైడెన్‌...

By: chandrasekar Fri, 20 Nov 2020 5:27 PM

జార్జియాను రీకౌంటింగ్ ద్వారా త‌న ఖాతాలో వేసుకున్న బైడెన్‌...


అమెరికా 46వ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. జార్జియాలో విజేత‌గా నిలిచారు ఆ రాష్ట్రంలో నిర్వ‌హించిన రీకౌంట్‌లో ఆయ‌నే విజేత‌గా నిలిచారు. దీంతో కీల‌క‌మైన 16 ఎల‌క్టోర‌ల్ ఓట్లు బైడెన్ వ‌శం అయ్యాయి. 1996లో బిల్ క్లింట‌న్ త‌ర్వాత ఈ రాష్ట్రాన్ని ఓ డెమోక్ర‌టిక్ నేత సొంతం చేసుకోవ‌డం ఇదే తొలిసారి. అయితే జార్జియా విక్ట‌రీతో బైడెన్ 306-232 తేడాతో అధ్య‌క్ష రేసులో ఆధిక్యం సాధించారు.

జార్జియా రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగిన రెండు వారాల త‌ర్వాత మ‌ళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారు. ఆ రీకౌంటింగ్‌లో బైడెన్ గెలిచిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు పేర్కొన్నారు. 12,284 ఓట్ల తేడాతో బైడెన్ విజ‌యం సాధించిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు చెప్పారు. జార్జియాలో నిర్వ‌హించిన పేప‌ర్ బ్యాలెట్ ఓటింగ్ వ్య‌వ‌స్థ క‌చ్చితంగా ఉంద‌ని ఓ రిప‌బ్లిక‌న్ సేనేట‌ర్ ప్ర‌క‌టన‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం ఇంకా ఓట‌మిని అంగీక‌రించ‌లేదు. అధికార బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ‌కు కూడా ట్రంప్ స‌హ‌క‌రించ‌డంలేదు.

Tags :
|

Advertisement