Advertisement

  • అమెరికా చరిత్రలోనే భారీ ఓట్లను పొందిన అభ్యర్థిగా నిలువనున్న బిడెన్...

అమెరికా చరిత్రలోనే భారీ ఓట్లను పొందిన అభ్యర్థిగా నిలువనున్న బిడెన్...

By: chandrasekar Fri, 06 Nov 2020 03:52 AM

అమెరికా చరిత్రలోనే భారీ ఓట్లను పొందిన అభ్యర్థిగా నిలువనున్న బిడెన్...


అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగుతోంది. ఫలితాల్లో జో బిడెన్‌ ఆధిక్యం దిశగా పయనిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే 264 ఎలక్టోరల్‌ ఓట్లు దక్కాయి. మరో 6 ఓట్లు పొందితే ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఖాయం. డొనాల్డ్ ట్రంప్‌కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. చాలా రాష్ట్రాల్లో ట్రంప్ కంటే జో బిడెన్‌కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అంతేకాదు, ఆయన మరో రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే భారీ ఓట్లను పొందిన అభ్యర్థిగా నిలువనున్నారు.

బిడెన్‌కు ఇప్పటికే 7.19 కోట్ల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ 6.85 కోట్ల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో బిడెన్‌కు మరిన్ని ఓట్లు దక్కుతాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన రికార్డు బరాక్‌ ఒబామా పేరిట ఉంది. 2008లో ఒబామా 6.98 కోట్ల ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో బిడెన్‌ ఇప్పటికే ఈ మార్కును దాటేశారు. 7 కోట్లకు పైగా ఓట్లను సాధించి కొత్త రికార్డు సృష్టించారు. గత వందేళ్లలోనే అమెరికాలో ఈసారి అత్యధికంగా పోలింగ్‌ నమోదవడమే ఇందుకు కారణం.

Tags :
|

Advertisement