Advertisement

  • శ్రీ రామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంలోనే భూమి పూజ

శ్రీ రామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంలోనే భూమి పూజ

By: chandrasekar Wed, 05 Aug 2020 4:01 PM

శ్రీ రామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంలోనే భూమి పూజ


జైశ్రీరామ్ నినాదాలతో ప్రధాని మోడీ అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో శిలాపూజ, భూమిపూజ, కర్మ శిలాపూజల్లో ఈరోజు పాల్గొన్నారు. భూమి పూజలో భాగంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీ రామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంలోనే భూమి పూజ ముహూర్తంగా ఫిక్స్ చేశారు. 12.44 నుంచి 12.45 నిమిషాల మధ్య 32 సెకెన్లలో పునాది రాయి వేశారు ప్రధాని మోడీ. దేశంలో దశాబ్దాల కల నెరేవేరింది. రాముడి ఔన్నత్యాన్ని భారతీయులందరూ అలవరచుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన స్థలంలో వెండి ఇటుకను వేసి భూమిపూజ చేసిన అనంతరం భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరిగిన భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని ఇక్కడికి తీసుకొచ్చారు. 1989లో రామ మందిరం నిర్మాణం కోసం సుమారు 2.75 లక్షల ఇటుకలను రామ భక్తులు అయోధ్యకు పంపించారు.

bhoomi puja,abhijit,birth,sri ramachandra,ayodhya ,శ్రీ రామచంద్రస్వామి, పుట్టిన, అభిజిత్, ముహూర్తం, భూమి పూజ


‘జై శ్రీరామ్‌’ అక్షరాలు ఉన్న వంద ఇటుకలను భూమిపూజ, అనంతర నిర్మాణ పనుల కోసం వినియోగిస్తారని పూజారులు తెలిపారు. ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు మోడీ భార‌తీయ వేష‌ధార‌ణ‌లో ప్రత్యేక ఆకర్షణనలో నిలిచారు. మోడీ ధోతి కుర్తాను ధ‌రించారు. సిల్వర్‌ కలర్‌ ధోతీ, కాషాయరంగు కుర్తాలో భార‌తీయ పురాత‌న వ‌స్త్ర అలంక‌ర‌ణ‌ల‌లో మెరిశారు. భారతీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మందిర నిర్మాణం భూమి పూజ కోసం దేశంలోని 2000 ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చారు.

Tags :
|

Advertisement