Advertisement

  • హథ్రాస్ లో యువతి బాధిత కుటుంబానికి వై కేటగిరి భద్రత కల్పించాలన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్

హథ్రాస్ లో యువతి బాధిత కుటుంబానికి వై కేటగిరి భద్రత కల్పించాలన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్

By: chandrasekar Mon, 05 Oct 2020 3:14 PM

హథ్రాస్ లో యువతి బాధిత కుటుంబానికి వై కేటగిరి భద్రత కల్పించాలన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్


దేశంలో తీవ్ర నిరసనలు రేపిన యువతి సామూహిక లైంగిక దాడి కేసులో యువతి బాధిత కుటుంబానికి వై కేటగిరి భద్రత కల్పించాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పారు. వారికి ఇక్కడ భద్రత లేదని ఆయన ఆరోపించారు. సామూహిక అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరుగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. హథ్రాస్ బాధిత కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు.

వైరల్ గా మారిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో సెప్టెంబర్ 14న 19 ఏండ్ల దళిత యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఢిల్లీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న చనిపోయింది. మరోవైపు బాధిత కుటుంబం అనుమతి లేకుండానే ఆమె మృతదేహానికి అర్థరాత్రి వేళ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం వివాస్పదమైంది.

అక్కడ ఉన్నత వర్గానికి చెందిన వారి పలుకుబడివల్ల ఆ యువతిపై లైంగిక దాడి జరుగలేదని పోలీసులు అధికారులు తెలిపారు. దీంతో హథ్రాస్ బాధితురాలికి న్యాయం జరుగాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ ఘటనకు సంబందించిన బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశంలోని ప్రజలంతా కోరుతున్నారు.

Tags :

Advertisement