Advertisement

  • భారత్ కొవాగ్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ లో

భారత్ కొవాగ్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ లో

By: chandrasekar Thu, 20 Aug 2020 09:33 AM

భారత్ కొవాగ్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ లో


కరోనా వైరస్ కు వాక్సిన్ కనుగొనడంలో ప్రపంచ దేశాలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేల మన భారత దేశానికీ చెందిన కొవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్ రెండో దశకు చేరుకున్నాయి. భారతదేశంలో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 నిరోధక టీకా కొవాగ్జిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం గుహవటి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (జీఎంసీహెచ్‌) ఎంపికైందని అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వాశర్మ వెల్లడించారు. మొదటి దశ ట్రయల్స్‌లో విజయవంతమైన ఫలితాలను చూపించిన కొవాగ్జిన్‌ రెండో ఫేస్‌కు జీఎంసీహెచ్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

ఈ వాక్సిన్ ను పరిశీలించుటకు అనేక మంది వాలంటీర్ ద్వారా పరీక్షించ బోతున్నారు. మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలో 18.22 లక్షల కొవిడ్‌ టెస్ట్‌లు చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 79,667గా ఉండగా, ఇప్పటివరకూ 56,734 మంది కోలుకున్నారని వివరించారు. రికవరీ రేటు 71.2 శాతం, మరణాల రేటు 0.25 శాతం ఉందని వెల్లడించారు. కొవిడ్‌తో ఇప్పటివరకూ 197 మంది మరణించారని శర్మ తెలిపారు.

Tags :
|
|

Advertisement