Advertisement

  • కరోనా వ్యాక్సిన్ తొలి దశలో అద్భుత ఫలితాలు ఇచ్చింది ... భారత్‌ బయోటెక్

కరోనా వ్యాక్సిన్ తొలి దశలో అద్భుత ఫలితాలు ఇచ్చింది ... భారత్‌ బయోటెక్

By: Sankar Thu, 17 Dec 2020 11:48 AM

కరోనా వ్యాక్సిన్ తొలి దశలో అద్భుత ఫలితాలు ఇచ్చింది ... భారత్‌ బయోటెక్


కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేసాయి ..బ్రిటన్ లో ఆల్రెడీ వాక్సిన్ ను పంపిణి కూడా చేసారు ...అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు ప్రచారం జరిగింది...అయితే కోవిడ్‌-19 కట్టడికి దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ తొలి దశలో అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్ తాజాగా వెల్లడించింది.

కోవాగ్జిన్‌ పేరుతో హైదరాబాద్‌ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌పై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. తొలి దశ క్లినికల్‌ పరీక్షలలో కోవాగ్జిన్‌ ఎలాంటి ఇతర సమస్యలకూ తావివ్వలేదని కంపెనీ స్పష్టం చేసింది. వెరసి తొలి, రెండు దశల క్లినికల్‌ పరీక్షల డేటా ఆధారంగా కంపెనీ మార్కెటింగ్‌ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది.

అయితే ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని భారత్‌ బయోటెక్ పేర్కొంది. వ్యాక్సిన్‌ భద్రత, ప్రభావం వంటి అంశాలపై మరింత విస్తృతంగా నిర్వహించనున్న మూడో దశ పరీక్షల ద్వారా మాత్రమే తగిన డేటా లభించగలదని వివరించింది

Tags :
|

Advertisement