Advertisement

  • కరోనా కు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన మొదటి వ్యాక్సీన్

కరోనా కు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన మొదటి వ్యాక్సీన్

By: chandrasekar Tue, 30 June 2020 7:31 PM

కరోనా కు భారత్  బయోటెక్ సంస్థ తయారుచేసిన మొదటి వ్యాక్సీన్


ప్రపంచంలో అనేక దేశాలు కరోనాకు వ్యాక్సీన్ కనుగొనేందుకు రీసెర్చ్ లో మునిగిన దేశాల్లో ఇండియా పై చేయి సాధించనుందా అంటే అవుననే అన్పిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. భారతదేశ తొలి వ్యాక్సీన్ కు డీసీజీఐ అనుమతి లభించడమే దీనికి ప్రధాన కారణం.

భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సీన్ తయారీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సంస్థతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా ఏ సంస్థకు డీసీజీఐ (Drug controller and general of india) అనుమతి మాత్రం లభించలేదు.

రీసెర్చ్ చేసి కనుగొన్న వ్యాక్సీన్ లను మనుష్యులపై ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగాల్లో ఫేజ్ 1, 2, 3 దశలుంటాయి. ఇందులో భాగంగా ఇప్పుడు భారత్ బయోటెక్ సంస్థ (Bharat biotech company) రీసెర్చ్ చేసిన కోవ్యాక్సిన్ (COVAXIN) హ్యూమన్ ట్రయల్స్ (Human trials) ఫేజ్ 1, 2 లకు డీసీజీఐ (DCGI) అనుమతి ఇచ్చింది.

మహమ్మారి కాలంలో దేశవ్యాప్తంగా ఇప్పుడీ సంస్థ తాము తయారు చేసిన వ్యాక్సీన్ ను జూలై నుంచి మనుష్యులపై ప్రయోగించనుంది. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే కచ్చితంగా ఇది ఇండియాకు ఖ్యాతి తెచ్చిపెట్టనుంది. ఐసీఎంఆర్ (ICMR), ఎన్ ఐ వీ (National institute of virology - PUNE) ల సౌజన్యంతో భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సీన్ ను అభివృద్ధి చేసింది.

వాక్సిన్ కు పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి లక్షణాల్లేని కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి సేకరించిన SARS CoV-2 వైరస్ ను ఈ సంస్థకు అప్పగించారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉన్న ఈ సంస్థకు చెందిన అత్యంత ఆధునిక ల్యాబ్ లో దీన్ని BSL-3 (BIA SAFETY LEVEL-3) స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సీన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా తెలిపారు.

Tags :

Advertisement