Advertisement

  • భారత్ బయోటెక్...కోవాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించిన విదేశీ బృందం...

భారత్ బయోటెక్...కోవాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించిన విదేశీ బృందం...

By: chandrasekar Wed, 09 Dec 2020 9:55 PM

భారత్ బయోటెక్...కోవాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించిన విదేశీ బృందం...


ఈ రోజు బుధవారం నాడు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మెన్ కృష్ణ ఎల్లా 64 దేశాల ప్రతినిధులతో సమావేశమైయ్యారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ తయారీలో ముందు ఉంది. గత కొన్ని రోజుల క్రితం మన ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ బయోటెక్ ను స్వయంగా సందర్శించి వ్యాక్సిన్ తయారీ వివరాల గురించి తెలుసుకున్న విషయం తెలిసిందే.

హైద్రాబాద్ లో ఈ రోజు వివిధ దేశాలకు చెందిన 70 మంది అంబాసిడర్లు, హై కమిషనర్ల బృందం భారత్ బయోటెక్ ను సందర్శించింది. రెండు బృందాలుగా ఈ సభ్యులు విడిపోయారు. ఒక బృందం భారత్ బయోటెక్ ను మరో బృందం బయోలాజికల్ సెంటర్ ను పరిశీలించింది భారత్ బయోటెక్ బృందంతో వారు సమావేశమై కోవాక్సీన్ గురించి చర్చించారు. వ్యాక్సిన్ తయారీలో పురోగతిపై భారత్ బయోటెక్ మేనేజింగ్ డెరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా విదేశీ ప్రతినిధులకు తెలిపారు.

వారు మాట్లాడుతూ ‘కోవాక్సీన్’ అత్యంత సురక్షిమైన టీకా అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ ఈ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 300 మిలియన్ల డోస్ లతో రికార్డును ఇది సొంతం చేసుకుందని అన్నారు.

Tags :

Advertisement