Advertisement

మొబైల్ నీళ్లలో పడితే తీసుకోవలసిన జాగ్రతలు

By: chandrasekar Wed, 17 June 2020 3:13 PM

మొబైల్ నీళ్లలో పడితే తీసుకోవలసిన జాగ్రతలు


ఈమధ్య మొబైల్, ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. ఐతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మొబైల్ చేతిలోంచీ జారి నీటిలో పడుతుంది. అరెర్రే అని వెంటనే నీటిలోంచీ తీసినా అప్పటికే దాన్లోకి నీరు వెళ్లిపోతుంది. ఆ తర్వాత స్క్రీన్ రంగులు మారుతూ ఉంటుంది. టచ్ ప్యాడ్ సరిగా పనిచెయ్యదు. ఇలాంటి నీటిలో పడిన ఫోన్ల విషయంలో మొబైల్ కంపెనీలు కూడా తమకు సంబంధం లేదని చెబుతాయి. ఇలాంటి సమయంలో నిరాశ పడకుండా కొన్ని చర్యలు తీసుకుంటే మొబైల్ తిరిగి పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

* నీటిలో పడిన మొబైల్ ఆన్‌లో ఉంటే వెంటనే దాన్ని స్విచ్ఛాఫ్ చెయ్యాలి. కంగారు పడి మొబైల్‌ని ఆపరేట్ చెయ్యవద్దు. అది పనిచేసినా, చేయకపోయినా ముందు దాన్ని స్విచ్ఛాఫ్ చెయ్యాలి.

* మొబైల్‌ని నీటిలోంచి తీశాక ఎలా పట్టుకున్నారో అలాగే ఉంచాలి. అటూ ఇటూ ఊపకుండా జాగ్రత్త పడాలి.

* వేడి చేస్తే ఫోన్‌లో నీరు ఆవిరవుతుందని అలాంటి ప్రయత్నాలేవీ చేయవద్దు. ఎండలో పెట్టవద్దు.

* నీటిలోంచీ తీసిన తర్వాత దాని బ్యాక్ కవర్ తీసేయండి. తర్వాత పొడి గుడ్డతో ఫోన్‌ను తుడవవచ్చు. తర్వాత బ్యాటరీ, సిమ్, మెమరీ కార్డులను తీసేయాలి.

* ఆ తర్వాత మరోసారి మొబైల్‌ని పొడి గుడ్డ లేదా టిష్యు పేపర్‌తో తుడవాలి.

beware,when mobile,drop,into water,battery ,మొబైల్, నీళ్లలో, పడితే, తీసుకోవలసిన, జాగ్రతలు


* ఇప్పుడు ఓ కవర్‌లో బియ్యం తీసుకొని, అందులో ఫోన్, బ్యాటరీ ఉంచి పూర్తిగా బియ్యంతో కప్పేసి గాలి చేరకుండా కవర్‌ని క్లోజ్ చెయ్యాలి. బియ్యానికి నీటిని పీల్చేసే శక్తి బాగా ఉంటుందని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు.

* ఒక రోజంతా అలా ఉంచి ఆ తర్వాత మొబైల్ తీసి, మరోసారి తుడిచి బ్యాటరీ, సిమ్ వేసి ఆన్ చేసి వాడుకోవచ్చు.

* మొబైల్ పనిచేయకపోతే ఛార్జింగ్ పెట్టి చూడాలి. అయినా ఆన్ కాకపోతే కొత్త బ్యాటరీ వేసి ప్రయత్నించాలి. అప్పుడు కూడా ఆన్ కాకపోతే, ఇక సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లక తప్పదు.

సర్వీస్ సెంటర్ వాళ్లు ఏం చేస్తారు లోపలి పార్టులన్నీ ఊడదీసి చూస్తారు. ఆ పని మనమే చేద్దాం అని ఇంటిదగ్గర అలా చెయ్యకూడదు. ఎందుకంటే ఒక్కోసారి బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి మొబైల్‌లో వైర్ల లింకులు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ పనిని సర్వీస్ వాళ్లకే వదిలేయడం మేలు. చాలా సందర్భాల్లో మొబైల్ నీటిలో పడిన తర్వాత ఐదు నిమిషాల లోపు తీసేస్తే తిరిగి పనిచేస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్స్ చాలా వరకూ బాగా పనిచేస్తున్నాయి.

Tags :
|
|

Advertisement