Advertisement

  • వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక ..కెప్టెన్ గా బెన్ స్టోక్స్

వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక ..కెప్టెన్ గా బెన్ స్టోక్స్

By: Sankar Sun, 05 July 2020 11:02 AM

వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక ..కెప్టెన్ గా బెన్ స్టోక్స్



కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్లు జరగక దాదాపు మూడు నెలలు పైగా అవుతుంది ..దీనితో క్రికెట్ అభిమానులు ఎప్పుడు మ్యాచ్ లు స్టార్ట్ అవుతాయా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు..అయితే ఇప్పట్లో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం అసాధ్యం అని భావిస్తున్న తరుణంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దైర్యంగా అడుగు ముందుకు వేసింది ..బయో సెక్యూర్ వాతావరణంలో క్రికెట్ మ్యాచ్లను నిర్వహిస్తామని వెస్ట్ ఇండీస్ , పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లను ఆహ్వానించింది ..

దీనికి ఆ రెండు బోర్డులు ఒప్పుకోవడంతో ముందుగా వెస్ట్ ఇండీస్ లో టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ తలపడనుంది ..బుధవారం నుంచి మూడు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్ కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మేరకు ఫస్ట్ టెస్టు కోసం 13 మందితో కూడిన జట్టుని ఇంగ్లాండ్ ఈరోజు ప్రకటించింది.

తొలి టెస్టుకి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ దూరమవగా.. అతని స్థానంలో వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ టీమ్‌ని నడిపించనున్నాడు. జోరూట్ భార్య ఈ వారంలోనే బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని భావించిన రూట్.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుంచి అనుమతి తీసుకుని టీమ్ క్యాంప్‌ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంగ్లాండ్ ప్రకటించిన 30 మంది ప్రాబబుల్స్‌లో సీనియస్ స్పిన్నర్ మొయిన్ అలీ ఉన్నప్పటికీ.. తొలి టెస్టులో అతనికి చోటు లభించలేదు.అయితే స్టార్ ఆటగాడు బెయిర్‌స్టో కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు ..ఇటీవల కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోతున్న బెయిర్‌స్టో ..రూట్ లేకపోవడంతో తనకు చోటు దక్కుతుంది అనిభావించాడు ..అయితే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా విఫలం అవ్వడంతో అతడికి చోటు దక్కలేదు ..

ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల వివరాలు :బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), అండర్సన్, ఆర్చర్, డొమినిక్‌ బెస్, బ్రాడ్, రోరీ బర్న్‌స్, బట్లర్, క్రాలీ, డెన్లీ, సిబ్లీ, ఒలీ పోప్, వోక్స్, మార్క్‌వుడ్‌.

Tags :

Advertisement