Advertisement

  • కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశాను ..ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్

కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశాను ..ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్

By: Sankar Tue, 14 July 2020 11:54 AM

కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశాను ..ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్



ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా వెస్ట్ ఇండీస్ జట్టు ఇంగ్లాండ్ మీద విజయం సాధించడంతో ..ఇంగ్లాండ్ జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు ...బ్రాడ్ ను టీంలోకి తీసుకోకపోవడం , టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం , చివరి రోజు బ్లాక్ వుడ్ క్యాచ్ మిస్ చేయడం ఇలా అనేక రకాలుగా ఫస్ట్ టెస్టులో స్టోక్స్ విఫలం అయ్యాడు ..దీనితో అభిమానులు , మాజీలు స్టోక్స్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు ..అయితే కెప్టెన్సీ వాళ్ళ స్టోక్స్ సరిగా రాణించలేదని కొంత మంది భావిస్తున్నారు ..

అయితే సౌథాంప్టన్ టెస్టులో కెప్టెన్సీ మీ ఆటపై ప్రభావం చూపిందా..? అని బెన్‌స్టోక్స్‌ని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘‘నేను కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశాను. వాస్తవానికి గత కొంతకాలంగా కెప్టెన్సీపై నేను అవగాహన పెంచుకున్నా. దాంతో.. అవకాశం కోసం ఎదురుచూశా. మైదానంలో ఒక కెప్టెన్‌‌గా సౌథాంప్టన్ టెస్టులో తీసుకున్న నిర్ణయాల్ని నేను బాగా ఆస్వాదించా. కెప్టెన్సీ నా ఆటపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఒక ప్లేయర్‌‌గా మునుపటి తరహాలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించా’’ అని బెన్‌స్టోక్స్ వెల్లడించాడు.

ఇక ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ , బౌలింగ్ చేసిన స్టోక్స్ ఒక మోస్తరుగా రాణించాడు ...అయితే మ్యాచ్‌లో ఆఖరి రోజు స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన బెన్‌స్టోక్స్.. బ్లాక్‌వుడ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని నేలపాలు చేశాడు. దాంతో.. అతనే ఆఖరి వరకూ క్రీజులో నిలిచి విండీస్‌ని గెలిపించాడు.

Tags :
|
|

Advertisement