Advertisement

  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స ..సత్తా చాటిన బెన్ స్టోక్స్ ..ఆల్ రౌండర్లలో నెంబర్ వన్ స్థానం ...

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స ..సత్తా చాటిన బెన్ స్టోక్స్ ..ఆల్ రౌండర్లలో నెంబర్ వన్ స్థానం ...

By: Sankar Tue, 21 July 2020 8:01 PM

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స ..సత్తా చాటిన బెన్ స్టోక్స్ ..ఆల్ రౌండర్లలో నెంబర్ వన్ స్థానం ...



స్టిండీస్‌తో మాంచెస్టర్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్‌కి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతమైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 78* పరుగులు చేసిన బెన్‌‌స్టోక్స్.. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో.. 113 పరుగుల తేడాతో రెండో టెస్టులో గెలుపొందిన ఇంగ్లాండ్.. మూడు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. ఇంగ్లాండ్‌ని గెలిపించే ప్రదర్శన కనబర్చిన బెన్‌స్టోక్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగానే రానున్న శుక్రవారం నుంచి జరగనుంది.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు సోమవారం ముగియగా.. ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌ని ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ జాబితాలో 497 పాయింట్లతో బెన్‌స్టోక్స్ నెం.1 స్థానాన్ని దక్కించుకోగా.. దాదాపు 18 నెలల తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ 459 పాయింట్లతో నిలిచి తన అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 397 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

ఇక బాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తొలిస్థానం లో అలాగే ఉండగా , ఇండియన్ కెప్టెన్ కింగ్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు ..ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్లోనూ స్టోక్స్ సత్తా చాటాడు ..కెరీర్ లో తొలిసారిగా టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి ఎగబాకాడు ...

Tags :

Advertisement