Advertisement

  • అప్రైజర్‌గా మారి బ్యాంకుల నుండి లక్షలు స్వాహా....

అప్రైజర్‌గా మారి బ్యాంకుల నుండి లక్షలు స్వాహా....

By: chandrasekar Sat, 18 July 2020 5:33 PM

అప్రైజర్‌గా మారి బ్యాంకుల నుండి లక్షలు స్వాహా....


గుంటూరులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి బ్యాంకును మోసగించారు. అప్రైజర్‌గా మారి లక్షలు స్వాహా చేశారు. మేనేజర్‌కి అనుమానం రావడంతో నకిలీ బండారం బయటపడింది. నగరంలోని బ్రాడీపేట బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో హరికృష్ణ ప్రసాద్ కొన్నేళ్లుగా గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు.

ఈజీగా డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో అన్న రామకృష్ణ మోహన్‌తో కలసి ఈ మోసానికి పాల్పడ్డారు. వన్‌గ్రామ్ గోల్డ్‌తో బ్యాంకును బురిడీ కొట్టించారు. నకిలీ బంగారం కుదువ పెట్టి బంగారు రుణాలు తీసుకోవడం మొదలుపెట్టారు. బ్రాడీపేట, కొత్తపేట, శ్రీనగర్, పొన్నూరుకు చెందిన ఐదుగురితో కుమ్మక్కై ఏకంగా రూ.40 లక్షలు స్వాహా చేశారు.

గత కొద్దికాలంగా జరుగుతున్న ఈ నకిలీ బంగారం బాగోతంపై బ్యాంకు మేనేజర్ దివ్యాన్ష్ కుమార్‌కి అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బంగారంపై అనుమానం వచ్చిన మేనేజర్ పరీక్షలు చేయించగా నకిలీ బంగారంగా తేలింది.

అప్రైజర్ హరికృష్ణ ప్రసాద్, అతని అన్న రామకృష్ణ మోహన్‌, వారి ద్వారా రుణాలు తీసుకున్న వారి బంగారాన్ని పరీక్షించి మొత్తం 40 లక్షలు స్వాహా చేసినట్లు తేల్చారు. ఈ మేరకు అరండల్‌పేట్ పోలీసులకు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement