Advertisement

  • టీమ్‌ఇండియా స్పాన్సర్‌షిప్‌ కోసం త్వరలో టెండర్లను ఆహ్వానించనున్న బీసీసీఐ

టీమ్‌ఇండియా స్పాన్సర్‌షిప్‌ కోసం త్వరలో టెండర్లను ఆహ్వానించనున్న బీసీసీఐ

By: chandrasekar Mon, 20 July 2020 6:45 PM

టీమ్‌ఇండియా స్పాన్సర్‌షిప్‌ కోసం త్వరలో టెండర్లను ఆహ్వానించనున్న బీసీసీఐ


భారత క్రికెట్‌ నియంత్రణ మండలి టీమ్‌ఇండియా దుస్తులు స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కోసం త్వరలో కొత్తగా టెండర్లను ఆహ్వానించనుంది.

ఇటీవల జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అపెరల్‌ స్పాన్సర్‌షిప్‌ సహా పలు అంశాలపై చర్చించారు.

బీసీసీఐ ఉన్నతస్థాయి సమావేశంలో కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

స్పోర్ట్స్‌ కిట్‌ సంస్థ నైకీతో ఉన్న కాంట్రాక్ట్‌ సెప్టెంబర్‌ నెలాఖరుతో ముగియనుంది.

అక్టోబర్‌ 1 నుంచి మళ్లీ కొత్తగా ప్రారంభమయ్యే ఒప్పందం కోసం నైకీ ప్రెష్‌ ప్రపోజల్‌ను సమర్పించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.

గడచిన నాలుగేళ్ల కాలానికి గాను టీమిండియా అపెరల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం నైకీ రూ.30కోట్ల రాయల్టీతో రూ.370కోట్లు చెల్లించింది.

నేషనల్‌ క్రికెట్‌ అకాడమీని బెంగళూరులో మరో ప్రాంతానికి తరలించాలనే అంశంపైనా సమావేశంలో చర్చించారు.

Tags :
|
|

Advertisement