Advertisement

  • ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే టి ట్వంటీ సిరీస్ రద్దు అయ్యే అవకాశం ..

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే టి ట్వంటీ సిరీస్ రద్దు అయ్యే అవకాశం ..

By: Sankar Wed, 15 July 2020 7:29 PM

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే టి ట్వంటీ సిరీస్ రద్దు అయ్యే అవకాశం ..



ఐపీఎల్‌ జరగకుండా ఈ ఏడాది ముగియదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఎప్పుడో చెప్పేశాడు. దీనికి తగ్గట్టుగానే ప్రణాళికలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఆసియా టీ20 కప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడగా.. ఇక ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ కూడా అదే బాటలో పయనించడం ఖాయమే. ఐసీసీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా అంతా మానసికంగా సిద్ధమైపోయారు. ఇప్పటికే సెప్టెంబరు-అక్టోబరు స్లాట్‌ను బోర్డు సిద్ధంగా ఉంచుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య మూడు టీ20, నాలుగు టెస్టులు, 3 వన్డేల సిరీస్లు జరగాల్సి ఉంది. అయితే ఐపీఎల్‌ సజావుగా సాగేందుకు మూడు టీ20ల సిరీస్‌ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 3 నుంచి టెస్టు సిరీస్‌ ఆరంభమవుతుంది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇది వారం రోజులు ఆలస్యంగా జరిగే అవకాశాలున్నాయి. ఇక, టెస్టులకన్నా ముందు జరిగే టీ20 సిరీ్‌సను రద్దు చేయడమో లేక మ్యాచ్‌లను తగ్గించడమో జరుగనుంది. నిజానికి టీ20 ప్రపంచక్‌పకు ముందే తగిన ప్రాక్టీస్‌ కోసం ఇరు జట్ల మధ్య టీ20 సిరీ్‌సను ఆడించాలనుకున్నారు. వరల్డ్‌కప్‌ జరిగే అవకాశం లేకపోవడంతో పాటు ఐపీఎల్‌ నిర్వహణ ఖాయంగా మారడంతో టీ20లు అనవసరమనే భావనలో ఉన్నారు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :
|
|

Advertisement