Advertisement

  • వరల్డ్ కప్ స్థానంలో ఐపీయల్ జరిగితే బీసీసీఐ చాల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది ..ఇంజమామ్

వరల్డ్ కప్ స్థానంలో ఐపీయల్ జరిగితే బీసీసీఐ చాల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది ..ఇంజమామ్

By: Sankar Mon, 06 July 2020 7:05 PM

వరల్డ్ కప్ స్థానంలో ఐపీయల్ జరిగితే బీసీసీఐ చాల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది ..ఇంజమామ్



ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే ఐపీయల్ , ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణముగా నిరవధికంగా వాయిదా పడింది ..అయితే ఐపీయల్ వాయిదా పడటంతో అభిమానులు మాత్రమే కాకుండా క్రికెటర్లు కూడా నిరాశను వ్యక్తం చేసారు ఎందుకంటే ఐపీయల్ లో ఆడితే కాసుల వర్షం కురుస్తుంది ...అందుకే బీసీసీఐ కూడా ఐపీయల్ నిర్వహించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది ..అయితే ఈ ఏడాది చివర్లో టి ట్వంటీ వరల్డ్ కప్ జరగకపోతే ఆ స్థానంలో ఐపీయల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది ..

అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడి అదే సమయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జరిగితే అది అనేక అనుమానాలకు తావిస్తోందని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ స్పష్టం చేశాడు. కరోనా వైరస్‌ ​కారణంగా క్రికెటర్లను రిస్క్‌లోకి నెట్టడం ఇష్టం లేక టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసేందుకు ఐసీసీ యోచిస్తోంది. కాగా, వరల్డ్‌కప్‌ వాయిదా పడితే ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్‌ అవుతుందని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఇలా చేస్తే అనేక ప్రశ్నలకు ఉత్పన్నమవుతాయని ఇంజీ పేర్కొన్నాడు. ‘ బీసీసీఐ చాలా బలమైన క్రికెట్‌ బోర్డు. ఐసీసీలో బీసీసీఐదే కీలక పాత్ర. కరోనా వైరస్‌ కారణంగా మేము టీ20 వరల్డ్‌కప్‌ జరపలేమని ఆస్ట్రేలియా చేతులెత్తేస్తే అది ఆమోదయోగ్యమే. అదే సమయంలో వేరే మిగతా ఈవెంట్లు జరిగితే ప్రశ్నల వర్షం తప్పదు.

ఒకవేళ వరల్డ్‌కప్‌ను వాయిదా వేసి ఆ ప్లేస్‌లో ఐపీఎల్‌ జరిగితే దీన్ని ఏమని అర్ధం చేసుకోవాలి. ఐపీఎల్‌ జరపడానికి అన్ని అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ జరపడానికి బీసీసీఐ కసరత్తులు ముమ్మరం చేసింది. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ జరపాలని చూస్తోంది. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌ కాస్టర్స్‌, స్పాన్సర్స్‌, ఇతర స్టేక్‌ హోల్డర్లు అంతా ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఇంజీ తెలిపాడు.


Tags :
|
|
|

Advertisement