Advertisement

  • ఐపీయల్ నుంచి అర్దాంతరంగా తొలగించినందుకు డెక్కన్ ఛార్జర్స్ కు 4800 కోట్ల జరిమానా కట్టనున్న బీసీసీఐ ..

ఐపీయల్ నుంచి అర్దాంతరంగా తొలగించినందుకు డెక్కన్ ఛార్జర్స్ కు 4800 కోట్ల జరిమానా కట్టనున్న బీసీసీఐ ..

By: Sankar Sun, 19 July 2020 07:13 AM

ఐపీయల్ నుంచి అర్దాంతరంగా తొలగించినందుకు డెక్కన్ ఛార్జర్స్ కు 4800 కోట్ల జరిమానా కట్టనున్న బీసీసీఐ ..



ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఐపీయల్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది ..అప్పటిదాకా ఏ దేశంలో కూడా క్రికెట్ వల్ల లేని ఆదాయాన్ని ఐపీయల్ ఇండియన్ క్రికెట్ కు అందించింది ..ఐపీయల్ ప్రారంభంలో ఒక ప్రాంచైజీ అయిన డెక్కన్ ఛార్జర్స్ ఆ తర్వాత కాలంలో అనుహ్యంగా ఐపీయల్ నుంచి తీసేయబడింది ..

అయితే డెక్కన్ ఛార్జర్స్ టీమ్ యాజమాన్యం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ అప్పట్లో బీసీసీఐకి రూ.100 కోట్లు నేషనల్ బ్యాంక్‌ నుంచి పూచీకత్తుగా ఇవ్వడంలో విఫలమైంది. దాంతో.. ఆగ్రహించిన బీసీసీఐ.. 2012లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్‌ని టోర్నీ నుంచి తొలగించి.. వెంటనే బిడ్స్‌ని ఆహ్వానించగా.. ఆ జట్టు స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఛాన్స్ కొట్టేసింది. కానీ.. ఇలా జట్టుని టోర్నీ నుంచి తప్పించడం చట్ట విరుద్ధమని అప్పట్లో కోర్టుకెళ్లిన డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంఛైజీ.. దాదాపు 8 ఏళ్ల తర్వాత బీసీసీఐపై గెలిచింది.

సెప్టెంబరులోగా డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంఛైజీకి ఆ పరిహారం చెల్లించాలని జస్టిస్ టక్కర్‌ ఆదేశించారు. అయితే.. బీసీసీఐ ఈ తీర్పుని సవాలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌ వాయిదాతో ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయిన బీసీసీఐ.. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అయితే రూ.4000 కోట్లు నష్టపోనుందని అంచనా. ఈ నేపథ్యంలో.. డెక్కన్ ఛార్జర్స్‌కి రూ. 4,800 కోట్లు చెల్లించడం బీసీసీఐకి తలకి మించిన భారమే..!

Tags :
|
|

Advertisement