Advertisement

  • ప్రేక్షకులు లేకుండానే కేరింతలు , చప్పట్లతో దద్దరిల్లిన స్టేడియం ..ఎలానో తెలుసా !

ప్రేక్షకులు లేకుండానే కేరింతలు , చప్పట్లతో దద్దరిల్లిన స్టేడియం ..ఎలానో తెలుసా !

By: Sankar Sun, 20 Sept 2020 08:20 AM

ప్రేక్షకులు లేకుండానే కేరింతలు , చప్పట్లతో దద్దరిల్లిన స్టేడియం ..ఎలానో తెలుసా !


క్రికెట్ అంటే అభిమానుల కేరింతలు , హుషారులు చప్పట్లు ఉండాలి..అవి లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఆటగాడు మైదానంలో ఉన్న కూడా టివిలో చూసే అభిమానులకు అంతగా కిక్ ఇవ్వదు..సరిగ్గా బీసీసీఐ కూడా ఇలాగె ఆలోచించినట్లుంది..కరోనా కారణంగా ఖాళి మైదానంలో మ్యాచ్ లు జరుగుతుండటంతో టివీలలో చూసే ప్రేక్షకులకు బొర్ కొట్టకూడదు అని కృత్రిమంగా అభిమానుల సౌండ్ లను సెట్ చేసింది...

మ్యాచ్ లో తొలి బంతికి రోహిత్‌ ఫోర్‌... ఆ తర్వాత డి కాక్‌ షాట్లు, ఆపై వికెట్లు... ఇలా మ్యాచ్‌లో ఏం జరిగినా.... ప్రేక్షకుల చప్పట్లు, కేరింతలతో స్టేడియంలో హోరెత్తిపోతోంది! అదేంటి ఈ ఐపీఎల్‌కు అభిమానులను మైదానంలోకి అనుమతించలేదు కదా అనుకుంటున్నారా... ఐపీఎల్‌ నిర్వాహకులు టీవీ ప్రేక్షకుల కోసం చేసిన మాయ ఇది. లీగ్‌ ఆరంభానికి ముందే రికార్డు చేసిన శబ్దాలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతిని కలిగించేందుకు ఐపీఎల్‌ టీమ్‌ ప్రయత్నించింది.

అయితే చాలా వరకు అందులో సఫలమైంది కూడా. సరిగ్గా చెప్పాలంటే ఆటకు, కేకకు సింకింగ్‌ బాగా కుదిరింది. అయితే ఇలా చేయడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆకట్టుకుందని కొందరంటే... లీగ్‌ను సహజంగా చూపిస్తేనే బాగుండేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరు జట్లకు చెందిన కొందరు అభిమానుల స్పందనలను కూడా మ్యాచ్‌ సాగుతున్న సమయంలో లైవ్‌ కెమెరాల ద్వారా ప్రసారకర్తలు చూపించారు.

Tags :
|
|
|

Advertisement