Advertisement

  • 2020 ఐపీయల్ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్ గంగూలీ

2020 ఐపీయల్ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్ గంగూలీ

By: Sankar Thu, 09 July 2020 06:51 AM

2020 ఐపీయల్ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్ గంగూలీ



ఐపీయల్ ..గత పన్నెండు ఏళ్లుగా భారత క్రికెట్ లో అత్యంత ముఖ్యమైన టోర్నీ ..ప్రతి ఏడాది తన స్థాయిని పెంచుకుంటూ దూసుకుపోతున్న ఐపీయల్ కు ఈ ఏడాది బ్రేక్ పడింది ..కరోనా మహమ్మారి కారణంగా ఐపీయల్ నిరవధికంగా వాయిదా పడింది ..అయితే ఇండియాలో కరోనా అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గేలా లేదు ..ఇలాంటి పరిస్థితుల్లో ఐపీయల్ ఈ సీజన్ నిర్వహణ బీసీసీఐ కి కత్తి మీద స్వాము లాంటిది ..ఒకవేళ ఐపీయల్ జరగకపోతే బీసీసీఐ కి వేల కోట్లలో నష్టం వస్తుంది..

టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేస్తే.. సెప్టెంబరు చివరి వారం నుంచి నవంబరు మొదటి వారం వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ.. సెప్టెంబరులో ఆసియా కప్ 2020 టోర్నీని నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించిన పీసీబీ.. నవంబరులోనూ పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై తుది నిర్ణయం ప్రకటించకుండా ఐసీసీ నాన్చుడి ధోరణిలో వ్యవహరిస్తోంది..

అయితే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘ఐపీఎల్ లేకుండా ఈ ఏడాదిని ముగించకూడదని మేము పట్టుదలతో ఉన్నాం. కరోనా వైరస్ నేపథ్యంలో.. భారత్‌లో టోర్నీకి అవకాశం లేకపోతే విదేశాల్లో నిర్వహిస్తాం. కానీ.. అది చివరి ఆప్షన్ మాత్రమే. ఆతిథ్యం విషయంలో బీసీసీఐ ఫస్ట్ ప్రాధాన్యత భారత్‌కే. బీసీసీఐ.. ఐపీఎల్ ఆతిథ్యం గురించి ఇప్పటి వరకూ ఏ దేశ క్రికెట్ బోర్డుతోనూ చర్చించలేదు’’ అని గంగూలీ వెల్లడించాడు.

Tags :
|
|
|
|

Advertisement