Advertisement

  • బీసీసీఐ తన స్పూర్తి రగులుస్తూ... కొత్త పాట నెట్టింట్లో వైరల్

బీసీసీఐ తన స్పూర్తి రగులుస్తూ... కొత్త పాట నెట్టింట్లో వైరల్

By: chandrasekar Wed, 09 Sept 2020 1:08 PM

బీసీసీఐ తన స్పూర్తి రగులుస్తూ... కొత్త పాట నెట్టింట్లో వైరల్


ఐపీఎల్ 2020 నిర్వహించాలన్న బీసీసీఐ కల త్వరలోనే నిజం కానుంది. ఎన్నో అడ్డంకులు తట్టుకుని ముందుకు దూసుకెళ్ళింది. చివరకు సెప్టెంబర్ 19న యుఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు సిద్దమయింది. తాజా తన స్పూర్తి రగులుస్తూ,అభిమానుల ఆత్మవిశ్యాసాన్ని పెంపోదిస్తూ ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించింది. ఇప్పుడు ఈ పాటకు విశేషమైన స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆయేంగే హమ్‌ వాపస్‌’ లాంటి చరణాలతో రోమాలు నిక్కబొడిచేలా పాట చిత్రీకరించారు. మరో పది రోజుల్లో జరగబోయే ఐపీఎల్ కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫస్ట్ మ్యాచ్ ముంబాయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబాయ్ వేదికగా జరగనుంది. ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఎట్టకేలకు ఆదివారం విడుదల చేసింది. ఇప్పటివరకు లీగ్ దశ వరకు మాత్రమే తేదిలను ప్రకటించింది. త్వరలో పూర్తి షెడ్యూల్ కూడా ప్రకటించనున్నది. సుదీర్ఘంగా 53 రోజులపాటు సాగే ఈ ఐపీఎల్‌లో 56 లీగ్‌ మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 19న టోర్నీ మెుదలై నవంబరు 10 వరకు జరగనున్న సంగతి తెలిసింది. టోర్నీ మొత్తంగా 60 మ్యాచ్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 3.30కి తొలి పోరు జరగనుండగా, రాత్రి 7.30కి రెండో పోరు మెుదలవుతుంది.

Tags :
|
|
|

Advertisement