Advertisement

  • క్రికెట్ ఆస్ట్రేలియా క్వారంటైన్ రూల్స్ కు ససేమిరా అంటున్న బీసీసీఐ

క్రికెట్ ఆస్ట్రేలియా క్వారంటైన్ రూల్స్ కు ససేమిరా అంటున్న బీసీసీఐ

By: Sankar Tue, 08 Sept 2020 08:10 AM

క్రికెట్ ఆస్ట్రేలియా క్వారంటైన్ రూల్స్ కు ససేమిరా అంటున్న బీసీసీఐ


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ఇప్పుడు జరుగుతున్న అన్ని మ్యాచ్ లు కఠినమైన కరోనా నియమాలను పాటిస్తున్నాయి. ముందుగా ఆటగాళ్లు అందరూ క్వారంటైన్ లో ఉండి ఆ సమయంలో వారికి చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ వస్తే వారు గ్రౌండ్ లోకి అడుగుపెడుతారు.

ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 కూడా అలానే జరుగుతుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్లిన జట్టు ముందుగా 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలి. కానీ బీసీసీఐ కు మాత్రం అలా 14 రోజులు వృధా చేయడం ఇష్టం లేదు. అందుకే క్వారంటైన్ లో ఉన్నప్పుడు కూడా ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించాలి అని షరతులు విధించింది.

కానీ క్రికెట్ ఆస్ట్రేలియా అందుకు ఒప్పుకోవడం లేదు. ఆటగాళ్లు బయటకు రాకుండా 14 రోజులు ఉండాల్సిందే అంటుంది. డిసెంబరు 3 న భారత్-ఆసీస్ మధ్య మొదటి టెస్ట్ జరగనుంది. అయితే కరోనా కారణంగా మ్యాచ్ లు అన్ని వాయిదా పడటంతో సీఏ బాగా నష్టపోయింది. అందువల్ల ఈ బోర్డు కు భారత్ తో ఆడే మ్యాచ్ లు చాలా ముఖ్యం.

Tags :
|

Advertisement