Advertisement

  • కరోనా లాక్ డౌన్ తర్వాత దేశవాళీ క్రికెట్ కు అనుమతి ఇచ్చిన బీసీసీఐ

కరోనా లాక్ డౌన్ తర్వాత దేశవాళీ క్రికెట్ కు అనుమతి ఇచ్చిన బీసీసీఐ

By: Sankar Sun, 13 Dec 2020 9:12 PM

కరోనా లాక్ డౌన్ తర్వాత దేశవాళీ క్రికెట్ కు అనుమతి ఇచ్చిన బీసీసీఐ


కరోనా వైరస్ కారణంగా గత ఏడాదిగా వాయిదా పడిన డొమెస్టిక్ క్రికెట్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ-20 టోర్నమెంట్‌ నిర్వహణకు ఓకే చెప్పింది.

ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్‌ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్‌ అభిమానులను అలరించనుంది. ఇక ముస్తాక్‌ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారో ఫైనల్‌ కానుంది.

ఇక కరోనా కరంగా ఆంతర్జాతీయ క్రికెట్ కు కూడా కొంచెం బ్రేక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత జాగ్రత్తలతో దుబాయ్ లో ఐపీయల్ నిర్వహించింది..ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా , ఇప్పటికే వన్ డే , టి ట్వంటీ సిరీస్ లను పూర్తి చేసుకుంది...ఇక మరికొద్ది రోజుల్లో టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా తో తలపడుతుంది...

Tags :
|

Advertisement