Advertisement

  • యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధం

యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధం

By: chandrasekar Thu, 23 July 2020 2:13 PM

యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధం


యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడటంతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముందుగానే ప్రారంభించటానికి అవకాశం ఉంది. భారత ప్రభుత్వ అనుమతి రాగానే, షెడ్యూల్‌తో సహా అన్ని విషయాలపై త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ చెబుతున్నారు.

సెప్టెంబర్‌ 26కు బదులుగా ఆనెల 19వ తేదీనే లీగ్‌ ప్రారంభమవుతుందని తెలుస్తున్నది. ఈ ఏడాది సీజన్‌ను సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌పై ప్రసారదారు స్టార్‌ ఇండియా అసంతృప్తితో ఉంది.

స్టార్‌ నిర్ణయాలకు అనుగుణంగా షెడ్యూల్‌తో పాటు మ్యాచ్‌ సమయాల్లో మార్పులు చేయడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నది. ఐపీఎల్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభిస్తే సాయంత్రం మ్యాచ్‌లను తగ్గించే అవకాశం ఉంటుంది. రాత్రి మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బదులుగా 7.30గంటలకు ప్రారంభంకానున్నాయి.

Tags :
|
|
|

Advertisement