Advertisement

  • యువరాజ్ సింగ్ ఆడటానికి వీళ్లేదు ..షాకిచ్చిన బీసీసీఐ

యువరాజ్ సింగ్ ఆడటానికి వీళ్లేదు ..షాకిచ్చిన బీసీసీఐ

By: Sankar Tue, 29 Dec 2020 5:00 PM

యువరాజ్ సింగ్ ఆడటానికి వీళ్లేదు ..షాకిచ్చిన బీసీసీఐ


అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ దేశవాళీ క్రికెట్ లో ఆడేందుకు ఆసక్తి చూయించాడు..దీనితో యువి సొంత రాష్ట్రము అయిన పంజాబ్ జట్టు ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకున్నాడు..అయితే యువి ఆడటం ఖాయం అనుకుంటున్నా తరుణంలో బీసీసీఐ ఈ స్టార్ ఆల్ రౌండర్ కు షాకిచ్చింది...యువి ఇక ఎట్టి పరిస్థితుల్లో బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీలో ఆడేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యువరాజ్ సింగ్.. విదేశీ ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడేశాడు. తొలుత గ్లోబల్ టీ20 కెనడా, ఆ తర్వాత టీ10 లీగ్ ఆడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత క్రికెటర్ ఎవరూ రిటైర్మెంట్ ఇవ్వకుండా విదేశీ లీగ్స్‌లో ఆడకూడదు.. అలానే విదేశీ లీగ్స్‌లో ఆడిన తర్వాత మళ్లీ బీసీసీఐ పరిధిలో జరిగే మ్యాచ్‌ల్లో ఆడేందుకు అనర్హులు.

ఈ నిబంధన కారణంగానే యువరాజ్ సింగ్‌కి రీఎంట్రీ అవకాశం చేజారింది. యువీతో పాటు గత ఏడాది రిటైర్మెంట్ ఇచ్చిన అంబటి రాయుడు.. నెలల వ్యవధిలోనే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి విదేశీ లీగ్స్‌లో రాయుడు ఆడకపోవడంతో.. బీసీసీఐ అతడ్ని మళ్లీ ఆడేందుకు అనుమతించింది.

Tags :
|
|
|
|

Advertisement