Advertisement

  • ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీయల్ జరగడమే గొప్ప ... నష్ట పరిహారం అడిగిన ప్రాంచేజిలకు షాకిచ్చిన బీసీసీఐ

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీయల్ జరగడమే గొప్ప ... నష్ట పరిహారం అడిగిన ప్రాంచేజిలకు షాకిచ్చిన బీసీసీఐ

By: Sankar Tue, 01 Sept 2020 2:44 PM

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీయల్ జరగడమే గొప్ప ... నష్ట పరిహారం అడిగిన ప్రాంచేజిలకు షాకిచ్చిన బీసీసీఐ


ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మన దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదుకావడంతో అసలు ఈ టోర్నీ జరుగుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే అందులో ఆడే ఆటగాళ్లతో పాటుగా ఫ్రాంఛైజీలకు కూడా భారీగా నష్టం వచ్చేది. ఇక భారత్ లో ఈ వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఐపీఎల్ వేదికను యూఏఈ కి మార్చేసింది బీసీసీఐ. అక్కడ ఆటగాళ్ల భద్రత, కరోనా పరీక్షలు నిర్వహించడం, ఆటగాళ్ల కుటుంబాలను బయో బబుల్ లోకి అనుమతించడం వంటి అన్ని బాధ్యతలను బీసీసీఐ ఫ్రాంఛైజీలకు అప్పగించింది.

ఐపీఎల్ భారత్ లో కాకుండా యూఏఈ లో జరిగితే తమకు నష్టం వస్తుందని... దానిని బీసీసీఐ తమకు ఇవ్వాలని ఫ్రాంఛైజీలు కోరాయి. ఇక ఈ విషయం పై ఓ బీసీసీఐ అధికారి స్పందిస్తూ... ఈ ఏడాది ఐపీఎల్‌ జరగడమే గొప్ప. అదీ లేకపోతే వారంతా ఏం చేసేవారు. అర్థం లేని డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఈసారి ఐపీఎల్ తో ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం రూ. 150 కోట్లు వస్తాయి. ఇదంతా మాకు తెలియదా'' అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. అయితే ఈ నెల 19 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ యొక్క షెడ్యూల్ ఇంకా కూడా బీసీసీఐ విడుదల చేయలేదు.

Tags :
|
|

Advertisement