Advertisement

  • బీసీసీఐ చైర్మన్‌ సౌరవ్‌ గంగూలీకి పన్నుల కేసులో రిలీఫ్...

బీసీసీఐ చైర్మన్‌ సౌరవ్‌ గంగూలీకి పన్నుల కేసులో రిలీఫ్...

By: chandrasekar Thu, 17 Dec 2020 11:28 AM

బీసీసీఐ చైర్మన్‌ సౌరవ్‌ గంగూలీకి పన్నుల కేసులో రిలీఫ్...


కోల్‌కతాలోని కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ధర్మాసనం గంగూలికి రూ.1.5 కోట్ల మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2006 లో ఐపీఎల్‌లో ఆడిన మ్యాచ్‌లు, అతడు రాసిన ఆర్టికల్స్‌, ప్రదర్శనలపై సేవా పన్ను అథారిటీ గంగూలీ నుంచి పన్ను వసూలు చేసింది. ఇందుకు ఆపోజిట్ గా గంగూలీ హైకోర్టులో కేసు వేసాడు. సేవా పన్ను అధికారులు గంగూలీ మొత్తం రుసుమును కాంపోజిట్ ఫీగా భావించి దానిపై పన్ను విధించారు. 2016 లో కోల్‌కతా హైకోర్టు ఈ డిమాండ్‌ను తిరస్కరించింది.

హైకోర్టు వడ్డీతో పాటు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కేసును విచారించిన కోల్‌కతాలోని ట్రిబ్యునల్ పిటిషనర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసినందున, పిటిషనర్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి అందుకున్న పారితోషికంపై వ్యాపార సహాయ సేవగా పన్ను విధించలేమని తెలిపింది. 2010 జూలై 1 కి ముందు కాలానికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌పై కూడా పన్ను డిమాండ్ చేయగా, ఈ తేదీ తర్వాత బ్రాండ్ ప్రమోషన్ పన్ను విధించబడింది. టీవీ షోలను ఎంకరేజ్ చేసినందుకు వేతనం కోసం లేదా పత్రికలకు ఆర్టికల్స్‌ వ్రాసినందుకు పన్ను డిమాండ్ కూడా ట్రిబ్యునల్‌ ఖండించింది.

Tags :
|

Advertisement