Advertisement

  • ఐపీయల్ స్పాన్సర్ వివో పై ఎటు తేలుచుకోలేకపోతున్న బీసీసీఐ

ఐపీయల్ స్పాన్సర్ వివో పై ఎటు తేలుచుకోలేకపోతున్న బీసీసీఐ

By: Sankar Tue, 23 June 2020 10:26 AM

ఐపీయల్ స్పాన్సర్ వివో పై ఎటు తేలుచుకోలేకపోతున్న బీసీసీఐ



ఇండియన్ క్రికెట్ కు 2020 అంతగా కలిసొచ్చేలా లేదు ఒకవైపు కరోనా కారణంగా ఐపీయల్ నిర్వహణపై తర్జనభర్జనలు పడుతున్న బీసీసీఐ కు చైనా ఇండియా మధ్య సరిహద్దులో జరిగిన సంఘర్షణల వలన మరొక కొత్త చిక్కు వచ్చిపడింది ..భారతీయ సైనికులు 20 మందిన చైనా తో జరిగిన సంఘర్షణలో ప్రాణాలు అర్పించడంతో దానికి ప్రతీకారంగా చైనా నుంచి వచ్చే ఏ వస్తువు కూడ వాడొద్దు అని ఇండియాలో డిమాండ్ మొదలైంది ..దీనితో ఐపీయల్ కు స్పాన్సర్ గా ఉన్న వివో కూడా చైనా కంపెనీ కావడంతో దానితో ఉన్న స్పాన్సర్ షిప్ ను వెంటనే రద్దు చేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు..

బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుంది..అయితే ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ సమయంలో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ మార్పు కష్టమని బీసీసీఐ భావిస్తోంది. కానీ.. కేంద్ర ప్రభుత్వం.. చైనాపై సీరియస్‌గా ఉండటం, కొన్ని ప్రాజెక్ట్‌లను రద్దు చేసుకుంటూ ఉండటంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది.

ఐపీఎల్ 2020 సీజన్‌ నిర్వహణ, షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఈ వారంలో జరగాల్సి ఉంది. కానీ.. టోర్నీ టైటిల్ స్ఫాన్సర్‌‌షిప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో మీటింగ్‌ తాత్కాలికంగా వాయిదాపడినట్లు తెలుస్తోంది. మార్కెటింగ్ టీమ్ నుంచి డిటైల్‌గా రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనున్నట్లు సమాచారం.

అయితే హర్భజన్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్లు వివో ను స్పాన్సర్ షిప్ నుంచి తొలగించిన ఐపీయల్ కు వచ్చే నష్టం ఏమిలేదు అని వ్యాఖ్యానించారు ..ఐపీయల్ అనేది అత్యంత పెద్ద బ్రాండ్ దానిని మించిన బ్రాండ్ లేదు ..చైనా కంపెనీ కాకపోతే దానికంటే గొప్ప కంపెనీలు ఐపీయల్ స్పాన్సర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయని ..మనం మన ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ స్టార్ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు ..తనకు కూడా ఎలాంటి చైనా ఉత్పత్తులతో డీలింగ్స్ లేవు అని తెలిపాడు ..

Tags :
|
|
|

Advertisement