Advertisement

పంపిణీకు సిద్దమయిన బతుకమ్మ చీరలు..

By: Sankar Fri, 18 Sept 2020 9:15 PM

పంపిణీకు సిద్దమయిన బతుకమ్మ చీరలు..

తెలంగాణాలో ఏటా బతుకమ్మ పండక్కి తెల్ల రేషన్ కార్డు దారులకు అందించే చీరలు సిద్ధమయ్యాయి. సిరిసిల్ల నేతన్నల చేతుల్లో రూపొందిన ఈ చీరలు ఇప్పటి నుంచే జిల్లాలకు చేరుకుంటున్నాయి. బతుకమ్మ చీరలు గత కొన్ని రోజులుగా సిరిసిల్లలో నేస్తున్నారు.

ఇప్పటికే సుమారుగా 5 కోట్ల మీటర్ల వస్త్రాన్ని నేచిన నేతన్నలు వాటిని చీరలుగా మర్చారు. ఇంకా 2 కోట్ల మీటర్ల చీరలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీకి మొత్తం 220 రకాల చీరలను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 20 లక్షల చీరలు 9 మీటర్ల చీరలు ఉండగా 80 లక్షలు 6 మీటర్లు ఉండేలా తయారు చేస్తున్నారు.

సిరిసిల్లలో తొలుత నేసిన చీరలన్నింటినీ అక్కడే ఉన్న మార్కెట్ యార్డులో ప్రభుత్వం నిల్వ ఉంచింది. అక్కడ క్వాలిటీ చెక్ చేసి హైదరాబాద్ ప్రాసెసింగ్ యూనిట్‌‌‌కి తరలిస్తారు. బంగారం, వెండి రంగుల జరీలను కలుపుతూ ఈసారి క్వాలిటీగా చీరలను మహిళలకు అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

అయితే లాక్ డౌన్‌ వల్ల పని ఆగిపోగా అనుకున్న సమయానికల్లా చీరలు తయారు చేసేందుకు నేతన్నలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పటవరకు 85 లక్షల చీరలను నేసి ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. మరో 15 లక్షల చీరలు చివరి దశలో ఉన్నాయి. అయితే, ప్రతినెలా రావాల్సిన బిల్లుల విషయంలో జాప్యం జరుగుతోందని నేతన్నలు వాపోతున్నారు.

Tags :
|
|

Advertisement