Advertisement

  • నేటి నుంచి ఎంగిలిపూవ్వుతో బతుకమ్మ పండుగ మొదలు...!

నేటి నుంచి ఎంగిలిపూవ్వుతో బతుకమ్మ పండుగ మొదలు...!

By: Anji Fri, 16 Oct 2020 09:04 AM

నేటి నుంచి ఎంగిలిపూవ్వుతో బతుకమ్మ పండుగ మొదలు...!

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ నేడు శుక్రవారం ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు ఈనెల 24 వరకు ఈ పండుగ జరుగుతుంది. శతాబ్దాల చరిత గల బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

మహిళలు, యువతులు, బాలికలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మతో తెలంగాణ పూల పండుగను ముగిస్తారు. అయితే, ఈసారి కరోనా ప్రభావంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. ఇళ్ల వద్దనే పండుగ జరుపుకోవాలని భావిస్తోంది.

బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులంతా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రత్యేక పరిస్థితుల మధ్య పండుగ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ మూడు వీడియో పాటలను, 9 పాటలతో కూడిన సీడీని విడుదల చేశారు.

బతుకమ్మ పండుగ విషయంలో ఈసారి కొంత కన్‍ఫ్యూజన్‍ నెలకొంది. ఈ ఏడాది అధిక మాసం రావడం గందరగోళానికి కారణమవుతోంది. ఏటా భాద్రపద మాసంలో పెత్రమాస (పితృ అమావాస్య) సందర్భంగా మొదటిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ ఆడుకునే ఆచారం ఉంది. ఆ విధంగా చూస్తే సెప్టెంబర్ నెలలోనే బతుకమ్మ మొదలు కావల్సి ఉంది.

కాగా, సిద్ధాంతులు, వేద పండితులు మాత్రం అక్టోబర్ 16న అధిక ఆశ్వీజ మాసంలోని అమావాస్య నుంచి వరుసగా తొమ్మిది రోజులు బతుకమ్మ చేసుకోవాలని సూచించారు. దీంతో ఇవాళ ఎంగిలి పూవ్వు బతుకమ్మతో పూల పండుగ సంబురాలు షురూ అయ్యాయి.

Tags :

Advertisement