Advertisement

  • బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో బస్తీ ఆసుపత్రులు..

బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో బస్తీ ఆసుపత్రులు..

By: chandrasekar Thu, 12 Nov 2020 1:15 PM

బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో బస్తీ ఆసుపత్రులు..


తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో బస్తీ ఆసుపత్రులను ప్రారంభిస్తోంది. డివిజన్‌కు రెండు చొప్పున 300 బస్తీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేట్ క్లినిక్‌లకు ధీటుగా పేదలకు మెరుగైన వైద్యం సేవలు అందిస్తున్నాయి. నగరవాసులకు మంచి వైద్య సేవలు అందాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు హైదరాబాద్‌లో ఇప్పటికే 200 బస్తీ ఆసుపత్రులు ప్రారంభమయ్యాయి. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. వీటికితోడు మరో 24 బస్తీ ఆసుపత్రులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.గురువారం ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బస్తీ ఆసుపత్రులను ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.

రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో జీహెచ్‌ఎంసీ బస్తీ ఆసుపత్రులు ఏర్పాటు చేసింది. వీటిని మంత్రి కేటీఆర్‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ . హోంమంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించనున్నారు.

Tags :
|

Advertisement