Advertisement

  • 20 వసంతాలు పూర్తి చేసుకున్న బసవ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్

20 వసంతాలు పూర్తి చేసుకున్న బసవ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్

By: Sankar Mon, 22 June 2020 7:55 PM

20 వసంతాలు పూర్తి చేసుకున్న బసవ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్



బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ జూన్ 22 నాటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి చేతుల‌మీదుగా ప్రారంభ‌మైన ఈ సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నంద‌మూరి బాలకృష్ణ ఇక్కడ సేవలందించిన వైద్యులు, సిబ్బంది, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై బసవతారకం ఆస్పత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

మా తండ్రి అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావుగారు మా అమ్మగారు శ్రీమతి బసవతారకంగారి జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్స్ నిర్మాణం కొరకు బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌ను 1988లో స్థాపించడం జరిగింది. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజషన్ యుఎస్ఎ వారి సహకారంతో బసవతారకరామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా, 22 జూన్ 2000న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజపేయిగారు ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఈ హాస్పిటల్ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈరోజు వరకు 2.5 లక్షల వరకు క్యాన్సర్ రోగులకు ఈ హాస్పిటల్ నుండి చికిత్స చేయడం జరిగింది. ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. స్వర్గీయ డా. శ్రీ కోడెల శివప్రసాద్‌గారు ముందు ఉండి మమ్మల్ని నడిపించారు ..

ప్రస్తుత కోవిడ్- 19 మహమ్మారి ప్ర‌బ‌లిన‌ పరిస్థితులలో వ్యాది వ్యాప్తి చెందకుండా ఆసుపత్రి ఎన్నో జాగ్రత్త చర్యలను చేపట్టింది. రోగులకు వారి సహాయకులకు ముందు జాగ్రత్త కొరకు తగిన సమాచారాన్ని అందిస్తున్నాం. ప్రతిరోజు 1000 మంది రోగులు వారి సహాయకులు వచ్చే ఈ హాస్పిటల్‌లో కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా చూడడం యాజమాన్యానికి ఒక సవాల్ లాంటిది. ఈ ప్రయత్నానికి నేను అభినందిస్తున్నాను. మన క్యాంపస్‌లో స్నేహభావాన్ని కలిగిస్తూ క్యాన్సర్ రోగుల చికిత్సలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 24 గంటలు అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉండడం నాకు చాలా గర్వకారణం. అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. మన వ్యవస్థాపకులకు, గౌరవనీయులైన మాజీ బోర్డు సభ్యులకు, బోర్డు సభ్యులకు, డాక్టర్స్‌కు, నర్సులకు, పారామెడికల్, నాన్ మెడికల్ సిబ్బందికి, శ్రేయోభిలాషులకు మరియు ఆసుపత్రి అభివృద్ధిలో పాల్గొన్న దాతృత్వపు సంస్థలకు, వ్యక్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

Tags :
|

Advertisement