Advertisement

  • ఆరువేల కోట్లు చెల్లిస్తే అతడు జట్టు నుంచి తప్పుకోవచ్చు ..స్టార్ ఆటగాడికి షాకిచ్చిన యాజమాన్యం

ఆరువేల కోట్లు చెల్లిస్తే అతడు జట్టు నుంచి తప్పుకోవచ్చు ..స్టార్ ఆటగాడికి షాకిచ్చిన యాజమాన్యం

By: Sankar Mon, 31 Aug 2020 5:24 PM

ఆరువేల కోట్లు చెల్లిస్తే అతడు జట్టు నుంచి తప్పుకోవచ్చు ..స్టార్ ఆటగాడికి షాకిచ్చిన యాజమాన్యం


స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన జట్టు అయిన బార్సిలోనా ను వీడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయం పై ఇప్పటివరకు స్పందించని బార్సిలోనా జట్టు యాజమాన్యం తాజాగా స్పందించింది. అతను మా జట్టును వీడాలంటే 700 మిలియన్‌ యూరోలు అంటే 6 వేల కోట్లు చెల్లించాలి అని అప్పుడే తాము మెస్సీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేస్తామని బార్సిలోనా స్పష్టం చేసింది.

అయితే మెస్సీ కాంట్రాక్టు ఆ జట్టుతో వచ్చే ఏడాదితో ముగుస్తుంది. కానీ అతను ఏడాది ముందుగానే జట్టు నుండి తప్పుకోవాలనుకుంటున్నాడు. దాంతో ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం వారు ఈ మాట చెప్పినట్లు బార్సిలోనా జట్టు అధికారులు తెలిపారు. ఆ నిబంధనల ప్రకారం మెస్సీ జట్టునుండి తప్పుకోవాలనుకుంటే ఈ ఏడాది జూన్ 10 లోపే చెప్పాలి. కానీ అతను ఇప్పుడు చెప్పాడు. కాబట్టి అతను వచ్చే ఏడాది వరకు మా జట్టుకు ఆడాలి. లేదంటే 6 వేల కోట్లు చెల్లించాలి అని తెలిపారు.

ఇక బార్సిలోనా తరపున మొత్తం 731 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 634 గోల్స్ చేసాడు.ప్రపంచ ఓట్ బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో మెస్సి ఒకడు..రోనాల్డో తో కలిసి దాదాపు దశాబ్దం పైగానే ఫుట్ బాల్ ప్రపంచాన్ని మెస్సి శాశిస్తున్నాడు..ఇక తన కెరీర్ ప్రారంభం నుంచి బార్సిలోనా తరుపుననే ఆడుతున్న మెస్సి , ఈ సీజన్లో జట్టు దారుణ ప్రదర్శనతో బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు..

Tags :
|
|

Advertisement