Advertisement

  • ఆ బయోపిక్ లో నటించొద్దు ..విజయ్ సేతుపతిని కోరిన భారతీ రాజా

ఆ బయోపిక్ లో నటించొద్దు ..విజయ్ సేతుపతిని కోరిన భారతీ రాజా

By: Sankar Fri, 16 Oct 2020 07:56 AM

ఆ బయోపిక్ లో నటించొద్దు ..విజయ్ సేతుపతిని కోరిన భారతీ రాజా


శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే ..అందులో మురళీధరన్ గా ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు..అయితే ఇపుడు అదే అతడి మీద విమర్శలు వచ్చేలా చేస్తుంది..ఎమ్మెస్‌ శ్రీపతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఫస్ట్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు.

ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌లో విజయ్‌సేతుపతి నటిస్తుండడంపై తమిళ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. భారతీరాజా 800 చిత్రంలో నటించొద్దని విజయ్‌సేతుపతికి హితవు పలుకుతూ గురువారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో శ్రీలంక మతవాదనకి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య మురళీధరన్‌ అని అన్నారు.

ముత్తయ్య మురళీధరన్‌ నమ్మకద్రోహి అని పేర్కొన్నారు. అదేవిధంగా దర్శకుడు శీను రామస్వామి, చేరన్‌ కూడా ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు.

Tags :
|
|

Advertisement