Advertisement

  • ట్రంప్ ఒక క్రేజీ అంకుల్ అని చమత్కరించిన బ‌రాక్ ఒబామా

ట్రంప్ ఒక క్రేజీ అంకుల్ అని చమత్కరించిన బ‌రాక్ ఒబామా

By: chandrasekar Fri, 23 Oct 2020 09:19 AM

ట్రంప్ ఒక క్రేజీ అంకుల్ అని చమత్కరించిన బ‌రాక్ ఒబామా


అగ్ర దేశమైన అమెరికాలో ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం వేడిక్కింది. ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫైరయ్యారు. అమెరికా ఎన్నికల సందర్భంగా ఒక ర్యాలీలో పాల్గొన్న ఒబామా.. ట్రంప్ ఒక క్రేజీ అంకుల్ అని చమత్కరించాడు. ట్రంప్ తన పరిపాలనలో వివక్షతను పెంచి పోషించాడు అని విమర్శించాడు. పెన్సిల్వేనియా సభలో ఒబామా ఈ రకంగా విమర్శ చేశాడు. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ కూడా నార్త్ కరోలినాలో ఒక సభలో మాట్లాడుతూ ఒబామాను విమర్శించాడు.

ట్రంప్ చేసిన విమర్శల్లో భాగంగా గత ఎన్నికల్లో తను గెలవడానికి కారణం ఒబామా ప్రభుత్వం విఫలం అవ్వడమే అని తెలిపాడు. ఒమామాకు నిజాయితీ లేదు అని, ఒకప్పుడు హిల్లరీ క్లింటన్ కోసం ప్రచారం చేశాడు అని కానీ ఇప్పుడు బైడెన్ కోసం ప్రచారం చేస్తున్నాడు అని ట్రంప్ విమర్శించాడు. అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకు సుమారు 42 మిలయన్ల మంది వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేశారు. ఇలాంటి సందర్భంలో తను గెలవడానికి ట్రంప్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. బైడెన్ గెలిస్తే తను అమెరికా నుంచి వెళ్లిపోతానేమో అని ఇటీవలే కామెంట్ కూడా చేశాడు ట్రంప్. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మరి ఎన్నికలు పూర్తి కాగానే ఎవరు గెలుపొందుతారో వేచి చూడాల్సిందే.

Tags :
|
|
|

Advertisement