Advertisement

  • రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతున్న ఒబామా 'ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' పుస్తకం

రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతున్న ఒబామా 'ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' పుస్తకం

By: Sankar Fri, 20 Nov 2020 09:05 AM

రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతున్న ఒబామా 'ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' పుస్తకం


యూఎస్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రచించిన ‘‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’’పుస్తకం రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన తొలి 24 గంటల్లో ఈ బుక్‌ 8.9 లక్షల కాపీలు అమ్ముడైంది. ఆధునిక అమెరికా చరిత్రలో బెస్ట్‌ సెల్లింగ్‌ ప్రెసిడెన్షియల్‌ రచనగా నిలవనుంది.

పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ విడుదల చేసిన ఈ పుస్తకం అమ్మకాలకు దగ్గరలోకి వచ్చే పుస్తకం ఒబామా భార్య మిషెల్‌ రచించిన ‘‘బికమింగ్‌’’ కావడం విశేషం. బుధవారానికి అమెజాన్, బారన్స్‌ అండ్‌ నోబుల్‌ డాట్‌కామ్‌ సైట్లలో ఒబామా బుక్‌ నంబర్‌ 1 స్థానంలో ఉంది. పది రోజుల్లో అమ్మకాలు మరిన్ని రికార్డులు సృష్టించవచ్చని అంచనాలున్నాయి.

గతంలో బిల్‌ క్లింటన్‌ రచన ‘‘మైలైఫ్‌’’4 లక్షల కాపీలు, బుష్‌ రచన ‘‘డెసిషన్‌ పాయింట్స్‌’’2.2 లక్షల కాపీల మేర తొలిరోజు అమ్ముడయ్యాయి. ఒబామా పుస్తకం విడుదలైన సమయంలో దేశంలో అనిశ్చితి, సంక్షోభం నెలకొని ఉన్నా పుస్తక ప్రియులు మాత్రం విశేషంగా స్పందించారు.

Tags :
|
|
|

Advertisement