Advertisement

  • పశ్చిమ బెంగాల్లో అన్ని శనివారాలు బ్యాంకులు లీవ్

పశ్చిమ బెంగాల్లో అన్ని శనివారాలు బ్యాంకులు లీవ్

By: chandrasekar Wed, 22 July 2020 3:30 PM

పశ్చిమ బెంగాల్లో అన్ని శనివారాలు బ్యాంకులు లీవ్


పశ్చిమ బెంగాల్లో బ్యాంక్ లు ఇక నుంచి వారానికి ఐదు రోజులే పని చేయనున్నాయి. ప్రతి శనివారం బ్యాంకులు పని చేయవు. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఉత్వర్వులు కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నాయి.

అంతేకాదు కస్టమర్ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంటాయి. కరోనా వైరస్‌ బారిన పడుతున్న బ్యాంకు ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బ్యాంక్ బ్రాంచులు ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాల్లో పని చేయవు. అలాగే ఆదివారం బ్యాంక్ ఉద్యోగులకు కామన్ సెలవు ఉంటుంది. ఇకపై ప్రతి వారం శనివారం రోజున బ్యాంకులు పని చేయవు.

ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బ్యాంకులు వారానికి ఐదురోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తెలిపింది.

Tags :
|
|
|

Advertisement