Advertisement

  • ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్యాంక్ వాలంటీర్లను నియమించింది.

ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్యాంక్ వాలంటీర్లను నియమించింది.

By: chandrasekar Sat, 30 May 2020 12:09 PM

ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్యాంక్ వాలంటీర్లను నియమించింది.


ఆంధ్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చని గ్రామ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సేవలు ఇంటింటికీ చేరాలనే లక్ష్యంతో జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్లను నియమించింది. వీరికి ప్రతి నెలా వేతనం కూడా అందిస్తోంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మాదిరిగా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా బ్యాంక్ వాలంటీర్లను నియమించింది. అంటే బీసీ సఖీ యోజన స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద మహిళలను బ్యాంక్ వాలంటీర్లను నియమించుకుంటోంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ స్కీమ్ అసలు లక్ష్యం.

ఆ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బీసీ సఖీ యోజన స్కీమ్‌ను అమలు చేస్తోంది. బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుంటోంది. తొలి దశలో 58,000 మందిని నియమించింది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నెలకు రూ.4,000 వేతనం అందిస్తుంది. ఇలా ఆరు నెలలు ఇస్తుంది. అంతేకాకుండా వేతనంతోపాటు బ్యాంకులు కమిషన్ కూడా అందిస్తాయి. బ్యాంకింగ్ కరస్పాండెంట్‌గా చేరిన మహిళలకు బ్యాంకింగ్‌ గురించి తెలిసి ఉండాలి. గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంక్ సర్వీసులకు సంబంధించిన సేవలు అందించాలి.

bank volunteers,appointed,uttar pradesh,yogi adityanath,government ,ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వం, బ్యాంక్, వాలంటీర్లను


గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు నేరుగా బ్యాంకులకు కాకుండా వీరి వద్దకు వెళ్లి ఏమైనా చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంకులు బీసీ సఖీ కరస్పాండెంట్లకు రూ.50,000 అందిస్తాయి. దీని ద్వారా ఆన్‌లైన్ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దీన్ని బ్యాంక్ సేవలను ఉపయోగించాలి. రాష్ట్రంలోని ప్రతి బ్యాంక్ కచ్చితంగా వీరిని నియమించుకోవాలి. స్కీమ్‌ కింద జాబ్ పొందిన వారు బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు వేయడం, ఎవరికైనా డబ్బులు అవసరమైన వారి అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేయడం, లోన్ గురించి కస్టమర్లకు తెలియజేయడం, స్వయం సహాయక గ్రూప్స్‌ను రూపొందించడం, జన్ ధన్ ఖాతా తెరవడం, లోన్ రివకరీ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

దీనిలో చేరాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పరీక్ష ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ముగిసిన తర్వాత బీసీ సఖీ సర్టిఫికెట్ అందజేస్తారు. ఐడీ కార్డు ఇస్తారు. తర్వాత మీరు మీ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.

Tags :

Advertisement