Advertisement

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్నాటక బ్యాంక్, సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లకు రూ.6.5 కోట్ల పెనాల్టీ

బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్నాటక బ్యాంక్, సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లకు రూ.6.5 కోట్ల పెనాల్టీ

By: chandrasekar Sat, 30 May 2020 4:52 PM

బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్నాటక బ్యాంక్, సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లకు రూ.6.5 కోట్ల పెనాల్టీ


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మూడు బ్యాంకులకు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.6.5 కోట్ల పెనాల్టీ విధించింది. ఆర్‌బీఐ జరిమానా విధించిన బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్నాటక బ్యాంక్, సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు ఉన్నాయి.

ఆర్‌బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియాపైనే ఎక్కువ జరిమానా విధించింది. ఏకంగా రూ.5 కోట్ల పెనాల్టీ, కర్నాటక బ్యాంక్‌పై రూ.1.2 కోట్లు, అలాగే సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.30 లక్షల జరిమానా విధించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీపై ఆర్‌బీఐ స్పందిస్తూ ఆస్తుల కేటాయింపు, మొండి బకాయిలు, కరెంట్ అకౌంట్స్ ఓపెనింగ్, మోసాలను తెలియజేయడం వంటి వాటికి సంబంధించి బ్యాంక్ నిబంధనలను అతిక్రమించిందని పేర్కొంది.

bank,india,karnataka,saraswat,cooperative ,బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్నాటక బ్యాంక్, సరస్వత్, కో ఆపరేటివ్ బ్యాంక్‌లకు, కోట్ల పెనాల్టీ


ఆర్‌బీఐ అలాగే ఎన్‌పీఏల కేటాయింపులు సహా పలు అంశాల్లో నిబంధలను అతిక్రమించిందని కర్నాటక బ్యాంక్‌పై జరిమానా విధించింది. ఇక ఆస్తుల వర్గీకరణలో రూల్స్‌ను అతిక్రమించిందని అందుకే సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై జరిమానా విధించామని ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ జనవరి 29న ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై కూడా జరిమానా విధించిన విషయం తెలిసిందే. నో యువర్ కస్టమర్ నిబంధనలను బ్యాంక్ అతిక్రమించిందని అందుకే జరిమానా వేశామని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై ఆర్‌బీఐ పెనాల్టీలు విధిస్తూ వస్తుంది.

Tags :
|
|

Advertisement