Advertisement

  • స్వాతంత్య్ర పోరాటంలో మాకు అండగా నిలిచిన భారత ప్రజలకు కృతజ్ఞతలు ..బంగ్లా ప్రధాని

స్వాతంత్య్ర పోరాటంలో మాకు అండగా నిలిచిన భారత ప్రజలకు కృతజ్ఞతలు ..బంగ్లా ప్రధాని

By: Sankar Thu, 17 Dec 2020 7:23 PM

స్వాతంత్య్ర పోరాటంలో మాకు అండగా నిలిచిన భారత ప్రజలకు కృతజ్ఞతలు ..బంగ్లా ప్రధాని


1971 లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం లో ఇండియా పాకిస్తాన్ మీద విజయం సాధించింది ..ఇటీవలే ఇండో పాక్ వార్ యాబై ఏళ్ళు పూర్తి చేసుకుంది..ఈ యుద్ధం లో ఇండియా విజయం తర్వాతనే బంగ్లాదేశ్ కు స్వతంత్రం వచ్చింది..

స్వాతంత్ర్య పోరాటంలో తమకు అండగా నిలిచిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బంగ్లా ప్రధాని షేక్ హసీనా . భారత్‌ తమకు నిజమైన మిత్ర దేశమని షేక్‌ హసీనా అన్నారు ..తూర్పు పాకిస్తాన్‌ నుంచి విడిపోయి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో బంగ్లాదేశ్‌కు భారత్‌ పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాన మంత్రి షేక్‌ హసీనా గురువారం వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్‌ హసీనా మాట్లాడుతూ.. స్వాత్రంత్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. అదే విధంగా తమకు అండగా నిలబడిన భారత జవాన్లు, వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. తమ జాతి స్వేచ్ఛా పోరాటంలో సహకరించిన భారత ప్రభుత్వం, ప్రజల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు..

Tags :
|

Advertisement