Advertisement

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు విజయం

By: chandrasekar Tue, 22 Sept 2020 01:44 AM

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు విజయం


దేవ్‌దత్త పడిక్కల్ హాఫ్ సెంచరీ, చాహల్ బౌలింగ్ మెరుపులతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగిన మ్యాచ్‌ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరగా బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో గెలీచింది. సన్‌రైజర్స్ జట్టులో జానీ బెయిర్‌‌స్టో 61 పరుగులు చేయగా మనీష్ పాండే 34 పరుగులు చేశారు.

వార్నర్ నాటకీయ పరిణామంలో ఔటవ్వడం.. ఆ తర్వాత బెయిర్‌‌స్టో,మనీష్ పాండే అదుకునే ప్రయత్నం చేసిన వారు ఔటవ్వడంతో సన్‌రైజర్స్ బాట్స్‌మెన్స్ వెంటనే..వెంటనే వికెట్లు కోల్పోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఓటమిపాలైంది. మెుదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 163 పరుగులు చేసింది. ఓపెనర్ దేవదత్ పాడికల్ 42 బంతుల్లో 7 ఫోర్లుతో 56 పరుగులు చేయగా మరో స్టార్స్ బాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌ 30 బంతుల్లో 4 ఫోర్లుతో 2 'సిక్స్‌లతో 51 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

Tags :
|
|

Advertisement